NTV Telugu Site icon

Mark Antony: విశాల్ బెదిరిస్తున్నాడు బ్రో…

Vishal

Vishal

మాస్ సినిమాలు చేసి తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయిన హీరో ‘విశాల్’. స్టార్ హీరోల స్థాయి ఫాలోయింగ్ ని తెలుగు తమిళ రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న విశాల్, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘మార్క్ ఆంథోని’ సినిమా చేస్తున్నాడు. ఎస్.జే సూర్య కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాని ఆదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. పోస్టర్స్ తో మెప్పించిన మార్క్ ఆంథోని మేకర్స్ ఈసారి సాంగ్ తో బయటకి వచ్చారు. వింటేజ్ యాక్షన్ డ్రామాకి అదే రేంజ్ సాంగ్ ని ‘అదరదా మావా’ అంటూ జీవీ ప్రకాష్ సూపర్బ్ గా కంపోజ్ చేసాడు. రామజోగయ్య శాస్తి లిరిక్స్ ఫైర్ బ్రాండ్ లా ఉన్నాయి. ఈ లిరిక్స్ ని స్వయంగా విశాల్ పాడడం విశేషం. విశాల్ వోకల్స్ అదరదా మావా సాంగ్ ని మరింత వైల్డ్ గా మార్చింది.

మార్క్ ఆంథోని వస్తే బెదరదా మావా అంటూ సాంగ్ ని విశాల్ పాడిన విధానం… శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన విధానం బాగుంది. సాంగ్ లో వింటేజ్ వైబ్స్ పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 15న ప్రపంచం మొత్తం మార్క్ ఆంథోని సినిమా రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాపై విశాల్ చాలా హోప్ తో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న విశాల్, మార్క్ ఆంథోని హిట్ కొడితే అతని మార్కెట్ ని మంచి బూస్ట్ వచ్చినట్లు అవుతుంది, లేదంటే తెలుగుతో పాటు తమిళ మార్కెట్ ని కూడా విశాల్ కోల్పోవాల్సి వస్తుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కాబట్టి కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు విశాల్ సాలిడ్ హిట్ కొట్టేసినట్లే. ఆ టార్గెట్ మిస్ అవ్వకుండా మార్క్ ఆంథోని ప్రమోషన్స్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఓపెనింగ్స్ లో కూడా జోష్ కనిపించడం గ్యారెంటీ.