NTV Telugu Site icon

Adah Sharma: సంచలనం సృష్టిస్తున్న ‘కేరళ’ అమ్మాయిల మిస్సింగ్ ‘స్టొరీ’…

The Kerela Story

The Kerela Story

కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎలాంటి సంచనలం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇలాంటి సంచలనం సృష్టించడానికి రెడీ అవుతోంది అదా శర్మ. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ‘ది కేరళ స్టొరీ’. ‘ది లాస్ట్ మాంక్’, ‘లక్నో టైమ్స్’ లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన ‘సుదిప్తో సేన్’ ది కేరళ స్టొరీ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అదా శర్మ, యోగిత బిహాని, సోనియా బలాని, సిద్ధి ఇద్నానీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ మే 5న రిలీజ్ కానుంది. “కేరళలో 32000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు, ఇందులో ఎక్కువ శాతం హిందూ అమ్మాయిలే ఉంటున్నారు. వీరిని కొంతమంది ఆతంకవాదులు, ప్రేమ పేరుతో మోసం చేసి… మత మార్పిడి తర్వాత దేశం నుంచి బయటకి తీసుకోని వెళ్లి… అక్కడ నుంచి ఇండియాపైకి చెయ్యబోయే తీవ్రవాద కార్యకలాపాల్లో భాగం చేస్తున్నారు” అనే కథతో ‘ది కేరళ స్టొరీ’ సినిమా తెరకెక్కింది. ఇది ఫిక్షనల్ స్టొరీ అయ్యి ఉంటే ఎలాంటి సమస్యా వచ్చేది కాదు కానీ మేకర్స్ “ఇది ఒరిజినల్ స్టొరీ, కేరళ రాష్ట్రంలో నిజంగానే అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ఇందులో అన్ని మతాలకి చెందిన వారు ఉన్నారు కానీ ఎక్కువగా ఉన్నది మాత్రం హిందువులే. అమ్మాయిలని మోసం చేసి, ట్రాప్ చేసి దేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం” అని చెప్తుండడం దగ్గరే అసలు సమస్య వస్తోంది.

మే 5న రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ నాలుగు రోజుల క్రితం విడుదల చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ‘ది కేరళ స్టొరీ’ హాట్ టాపిక్ గా మారింది. కేరళలో అమ్మాయిలు అసలు మిస్ అవ్వట్లేదని ఒక వర్గం, 32000 మంది మిస్ అయ్యే ఛాన్స్ లేదని మరికొందరు, ఇది మన దేశంపైన పాకిస్తానీలు చేస్తున్న కుట్ర అని ది కేరళ స్టొరీ సినిమా నిజం చూపిస్తుందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ది కేరళ స్టొరీ టాపిక్ ఆఫ్ ది నేషన్ గా మారడంతో హీరోయిన్ అదా శర్మ రెస్పాండ్ అయ్యింది… “ఆడపిల్లలు కనిపించకుండా పోవడం దారుణం. కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఏమవుతున్నారు అని మాట్లాడడం మానేసి, అంతమంది అమ్మాయిలు మిస్ అవ్వలేదని కొందరు మాట్లాడడం బాధాకరం. నేను కొంతమంది బాధితులను కలిశాను, వారి బాధని నేను మాటల్లో వివరించలేకపోతున్నాను” అంటూ అదా శర్మ మాట్లాడింది. ఓవరాల్ గా ది కేరళ స్టొరీ సినిమా అయితే ఇండియా మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. మరి ఈ గర్ల్స్ మిస్సింగ్ కాన్స్పిరసీ గురించి కేరళ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది? ది కేరళ స్టొరీ సినిమాని బయటకి రానిస్తారా లేక బాన్ చేస్తారా అనేది చూడాలి.