Adah Sharma Response on Qualities of her wouldbe husband: ఆదా శర్మ ఈ ఏడాది దీ కేరళ స్టోరీ అనే సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది. నిజానికి ఆమె కెరీర్ విషయానికి వస్తే ముందుగా బాలీవుడ్ లో మొదటి సినిమా చేసినా ఆ తర్వాత హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. నిజానికి ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఈ భామ అందంగానే ఉన్నా పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తరువాత వచ్చిన అవకాశాల మేరకు ఆమె చేసుకుంటూ వెళ్లినా ఆమెకు స్టార్ డమ్ రాలేదు. అంతే కాదు ఎక్కువ సెకండ్ హీరోయిన్ పాత్రలు వచ్చినా వెనుకాడకుండా సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం లాంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇక తనకు సంబంధించిన ఫోటోలు, ఇంట్రెస్టింగ్ విడియోలు, సినిమా అప్డేట్స్ తో నింపేస్తుంది ఆమె.
RGV: బన్నీకి ఆర్జీవీ విషెస్.. పవన్ ను అవమానించాడా.. ?
ఈ క్రమంలో ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా అభిమానులతో చిట్ చాట్ చేయడానికి కూడా ట్రై చేస్తోంది. అయితే తాజాగా అదా శర్మ కొన్ని క్యూట్ ఫోటోలను షేర్ చేసుకుంది. ఈ ఫోటోల మీద చాలా మంది లైకుల వర్షం కురిపిస్తుంటే.. మరికొందరు సూపర్, హాట్ అని అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఒక నెటిజన్ మీరు ఎటువంటి అబ్బాయి కావాలి అనుకుంటున్నారు..? అంటూ పెళ్లి ప్రస్తావన తీసుకు వస్తే ఆదా శర్మ వింత సమాధానంతో అతని నోరు మూయించింది. అతనికి నాలుగు కాళ్లు ఒక తోక ఉంటే బాగుంటుంది, అలాంటి అబ్బాయే నాకు కావాలి అంటూ ఆమె ఆన్సర్ చేసింది. ఇక ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
