Vijayalakshmi: తమిళ నటి విజయలక్ష్మీ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఆమె మంచి సినిమాల్లోనే నటించింది. ముఖ్యంగా జగపతి బాబు, అర్జున్ సర్జా, వేణు తొట్టెంపూడి నటించిన హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతిబాబు, అర్జున్ చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత ఎన్నో మంచి సినిమాలు చేయడమే కాకుండా .. కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. ఇక సినిమాల ద్వారా కాకుండా ఆమె వివాదాల ద్వారానే ఫేమస్ అయ్యింది. నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు, దర్శకుడు సీమాన్ తనను మోసం చేశాడని ఎన్నో ఏళ్లుగా ఆమె పోరాటం సాగిస్తుంది. ఎవ్వరికీ తెలియకుండా అతను, తనను పెళ్లి చేసుకున్నాడని, కాపురం కూడా చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా అతనిపై కేసు కూడా పెట్టింది. తాను కలిసి జీవించాల్సి వస్తే అతనితోనే జీవిస్తాను అని, లేకపోతే చనిపోతాను అని కూడా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరి 29న ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సీమాన్ తనతో మాట్లాడాలని కోరింది. అయితే ఆ వీడియో పట్ల సీమాన్ స్పందించలేదు
ఇక తాజాగా ఆమె ఒక వీడియోను షేర్ చేసింది. అందులో విజయలక్ష్మీ ఆత్మహత్య చేసుకుంటున్నాను అని, అదే ఆమె చివరి వీడియో అని చెప్పడం కోలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఆ వీడియోలో విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ” సీమాన్ కు నేను ఒక వీడియో పంపాను. ఏడుస్తూ అతనితోనే ఉండాలనుకుంటున్నాను అని, నాతో మాట్లాడాలని అడిగాను. అందుకు ఆయన స్పందించలేదు. నువ్వు కావాలి..నువ్వు లేకుంటే చనిపోతాను అని చెప్పినా పట్టించుకోలేదు. నన్ను సీక్రెట్ గా పెళ్లి చేసుకొని.. నా జీవితాన్ని నాశనం చేసి.. ఇప్పుడు అక్కర్లేదు అన్నట్లు రోడ్డున పడేశాడు. నాకిప్పుడు ఎవరు సాయం చేయడం లేదు. నాకు ఇక్కడ ఉండాలని లేదు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. దీనికి సీమాన్ వివరణ ఇవ్వాలి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.