హైదరాబాదు గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకొంది. కన్నడలో చాలా సీరియల్ స్ లో నటించిన యాంకర్ శోభిత ఆత్మహత్య చేసుకుని మరణించింది.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన భర్తతో కలిసి గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. కన్నడలోని పలు సీరియల్ లో నటించిన శోభిత వివాహం చేసుకుని హైదారాబాద్ షిఫ్ట్ అయి గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. శోభిత ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే అంశం పై కారణాలు బయట పెట్టడం లేదు కుటుంబ సభ్యులు. శోభిత మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. రెండు ఒండ్ల మూడు, ఏటీఎం, ఒక్క కథే కెల్తా, జాక్‌పాట్, అపార్ట్‌మెంట్ టు మర్డర్, వందన వంటి కర్ణాటక సినిమాల్లో నటించింది శోభిత.
Also Read: Pushpa 2 Peelings: ఏంటి మామ ఆ గ్రేస్.. పీలింగ్స్ సాంగ్ అదిరిపోయింది!
అలాగే బ్రహ్మగంతు, నీనిదలేలో సీరియల్స్ లో కూడా ఆమె నటించింది. గచ్చిబౌలి లో శ్రీరామ్ నగర్ కాలనీ లో భర్త సుధీర్ తో కలిసి నివాసం ఉంటోంది బ్రహ్మగంతు సీరియల్ ఫేమ్ నటి శోభిత(32). ఈ రోజు తాను ఉంటున్న ఇంట్లోనీ సీలింగ్ ఫ్యాన్ కు చీర తో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. పెళ్ళి తర్వాత సినిమాలకి, సీరియల్స్ కి దూరంగా ఉంటూ వస్తోంది శోభిత. శోభిత మరణ వార్త తెలియడంతో శోభిత కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలి వెళ్లనున్నట్లు సమాచారం. కన్నడ హిందీ, హిందీ చిత్రసీమల్లో చురుకైన నటి శోభితా శివన్న వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది. ‘హిట్లర్ కళ్యాణ’ సీరియల్‌లో విలన్‌గా కూడా ఆమె నటించింది.