Site icon NTV Telugu

Actress Sangeetha: డబ్బు కోసమే స్టార్ కమెడియన్ తో పెళ్లి.. నటి సంగీత క్లారిటీ!

Redin Kingsley

Redin Kingsley

Actress Sangeetha Responds on Her Marriage with Redin Kingsley: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రెడిన్‌ కింగ్స్ లీ 46 ఏళ్ళ వయస్సులో సీరియల్ నటి సంగీత మెడలో మూడుముళ్లు వేశాడు. అతికొద్ది బంధుమిత్రుల మధ్య వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. రెడిన్‌ కింగ్స్ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో కోలమావు కోకిల సినిమాతో కెరీర్ ను ప్రారంభించాడు. ఇక శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో రెడిన్‌ పండించిన కామెడీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమా తరువాత ఎల్‌కేజీ, అన్నాత్తె, బీస్ట్‌, కాతువాకుల రెండు కాదల్‌, మార్క్‌ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్‌ సినిమాలలో నటించి స్టార్ కమెడియన్ గా సెటిల్ అయ్యాడు.

Anand Deverakonda: గం..గం..గణేశా కోసం ఆనంద్ దేవరకొండ సిక్స్ ప్యాక్!

గతేడాది నటి సంగీతను పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతే కాకుండా వీరి వివాహం మీద కొన్ని విమర్శలు వచ్చాయి. సంగీత డబ్బు కోసం రెడిన్ కింగ్స్లీని పెళ్లి చేసుకుందని సంగీతకు ఆడపిల్ల కూడా ఉందని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంగీత.. తనపై వచ్చిన విమర్శలపై స్పందించింది. నాకు ఆల్రెడీ ఓ బిడ్డ ఉందంటున్నారు కదా అది నా తమ్ముడి కూతురు. నేను డబ్బు కోసం రెడిన్ కింగ్స్లీని వివాహం చేసుకున్నానని అంటున్నారు. నేను కూడా సీరియల్స్ చేసి బాగా సంపాదించాను. ఏమీ లేకుండా నేను ఈ స్థాయికి రాలేదు. డబ్బు కోసం కాదు, రెడిన్ కింగ్స్లీ నాకు బాగా నచ్చాడు, అందుకే పెళ్లి చేసుకున్నానని సంగీత తెలిపింది.

Exit mobile version