NTV Telugu Site icon

Sana: ఆ హీరోతో పడక సీన్లు.. అందుకే చేశా.. ఇకముందు కూడా చేస్తా

Sana

Sana

Sana: టాలీవుడ్ నటి సన గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరో సినిమాల్లో అమ్మగా, అక్కగా, వదినగా నటించి మెప్పించింది. ముఖ్యంగా రవితేజ కృష్ణ సినిమాలో బ్రహ్మ్మనందం భార్యగా ఆమె నటన అద్భుతమని చెప్పాలి. ఇక ప్రస్తుతం సీరియల్స్ లో కూడా కనిపిస్తున్న సన.. మెట్రో కథలు అనే సిరీస్ లో బోల్డ్ గా నటించింది. హీరో ఆలీ రైజాతో ఘాటు రొమాన్స్ చేసింది. దీనిపై ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. మెట్రో కథలు.. ఒక సిటీ.. నాలుగు కథలు. ఆహా లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక తాజాగా ఆమె ఈ ట్రోల్స్ పై స్పందించింది. అలా బోల్డ్ గా ఎందుకు చేయాల్సివచ్చిందో చెప్పుకొచ్చింది. ” నేను మెట్రో కథలు చేయడానికి ప్రధానకారణం డైరెక్టర్ కరుణ కుమార్ – రైటర్ ఖాదీర్ బాబు. వారు కథ చెప్పిన విధానం బాగా నచ్చింది. ఆ కథల్లో ఒక కథ నాది. తాగుబోతు భర్త.. భార్యను పట్టించుకోడు. వేధిస్తాడు. దీంతో ఆమెకు మగవాళ్ళంటేనే అసహ్యం వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఒక అబ్బాయి పరిచయమవుతాడు. అతనితో కావాలని తప్పు చేయకపోయినా.. తప్పు చేయాల్సి వస్తుంది.

Balagam: ఓ విశ్వక్.. ‘బలగం’ గట్టి ‘ధమ్కీ’ ఇచ్చినట్టుందే..?

ఒక మహిళ.. భర్త పట్టించుకోకపోతే ఆమె మనసులో రేగే కోరికలను ఎలా అదుపుచేసుకుంటుంది.. అలానే ఇంటి బాధ్యతలను ఎలా నెత్తిమీద వేసుకొని చేస్తోంది అనేది చూపించారు. నిజ జీవితంలో ఎంతోమంది మహిళలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అందరికి నా పాత్ర ద్వారా చక్కని సందేశం ఇచ్చారు. కథ వాస్తవానికి దగ్గరగా ఉంది కాబట్టే నేను ఆ సీన్స్ లో నటించా. ఇలాంటి వాస్తవిక టఫ్ పాత్రలు ముందు ముందు వస్తే నటించడానికి నేను రెడీ. నా పాత్రలో ఎంత డెప్త్ ఉంటే.. ఇలా మాట్లాడుకుంటారు. నేను కూడా ప్రాజెక్ట్ కి సంతకం చేయడానికి ముందు అలాగే ఫీలయ్యాను. అందుకే ఆ పాత్ర కాస్తా సాహసోపేతంగా ఉన్న నో చెప్పలేకపోయాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments