NTV Telugu Site icon

Sameera Sherief: రక్తమోడే ఫోటో షేర్ చేసిన నటి.. అసలు ఏమైంది?

Actress Sameera Sherief Shares Disturbing Photo

Actress Sameera Sherief Shares Disturbing Photo

Actress Sameera Sherief Shares Disturbing Photo in Instagram: 2006 సంవత్సరంలో ‘ఆడపిల్ల’ సీరియల్‌తో బుల్లితెర నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన సమీరా షరీఫ్.. ఆ తర్వాత అభిషేకం, మూడు మూళ్ళ బంధం, ప్రతిబింబం, భార్యామణి, మంగమ్మ గారి మనవరాలు తదితర సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయింది. ఇక నాగబాబు ‘అదిరింది’ షోతో యాంకర్‌గా కూడా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది. అయితే పెళ్లి తర్వాత కెరీర్ పరంగా కాస్త స్లో అయిన సమీరా తనకు పిల్లలు పుట్టాక వారి ఆలనా పాలన మీదే దృష్టి పెట్టింది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫొటో షేర్ చేసింది. అందులో ఆమె పెదవి పగిలి రక్తం కారుతూ ఉండగా ఒక సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. ప్రతి కథకు ఒక్కొక్కరి అభిప్రాయం ఉంటుంది, ఇది నాది అంటూ మొదలు పెట్టిన ఆమె ఇది ఒక మెమరీలా ఉంటుందని తీసిన ఫోటో, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని అనుకోలేదు. కానీ నేను దీని గురించి మీ ఆలోచనలను తెలుసుకోవాలనుకున్నాను… మీరు ఈ ఫోటోను చూస్తున్నప్పుడు నేను సోదరీమణులు/స్నేహితులు/భర్తతో గట్టిగా గొడవపడినట్లు కనిపిస్తోంది.

Pushpa 2 The Rule: రూల్ చేసేందుకు ‘పుష్ప’గాడు దిగుతున్నాడు..రిలీజెప్పుడో చెప్పేశారు!

నిజానికి నేను భర్తతో చాలా మంచి సమయాన్ని గడిపాను. కానీ ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా భార్య భర్తల మధ్య గొడవ జరుగుతుంది. నిజానికి నేను నా భర్త అన్వర్ జాన్‌ని వివాహం చేసుకోక మునుపు నా శరీరంపై ఇలాంటి గాయాలు ఉండేవి, అవి నిజానికి నా మేనల్లుడు అయాన్‌ చేసినవి. అన్వర్ జాన్ తన మేనల్లుడు ప్రిన్స్ కారణంగా అలంటి గాయాలు అయ్యేవి. కానీ నేను, నా భర్త పెద్దగా గొడవ పడినట్టు ఈ పిక్ కనిపిస్తోంది. ఈ ఉదయం పొరపాటున అర్హాన్ వల్ల ఇది జరిగింది. కానీ మీరు గాయాన్ని చూస్తుంటే, అది ఖచ్చితంగా నా భర్త వల్ల అయి ఉంటుందని అనిపిస్తుంది. అవును మేము గొడవపడతాం, వాదించుకుంటాం కానీ అన్నింటికంటే మేము ఒకరినొకరు విపరీతంగా ప్రేమిస్తాము. ఇలాంటి గాయాల కారణంగా మీలో ఎంతమంది జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఈ పోస్ట్‌తో, మీరు మీ వైపు నుంచి అలోచించి దేనినీ లేదా ఎవరినీ జడ్జ్ చేయవద్దు అని నేను చెబుతానని ఆమె రాసుకొచ్చింది.

Show comments