NTV Telugu Site icon

RK Roja: పారిశుద్ధ్య కార్మికులతో రోజా షాకింగ్ ప్రవర్తన..వీడియో వైరల్

Rk Roja Viral Videp

Rk Roja Viral Videp

RK Roja Video Viral: ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా తెలుగు, తమిళ పరిశ్రమల్లో సత్తా చాటిన రోజా రాజకీయాల కోసం సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు బుల్లితెరలో కొన్ని షోస్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు వాటికి కూడా దూరమైన ఆమె 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘోర పరాజ్యం పాలయ్యారు. ఆ తర్వాత మీడియాకి కాస్త దూరంగా ఉంటూ వస్తున్న ఆమె అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కారు. తాజాగా రోజా తన భర్త సెల్వమణి తో కలిసి తమిళనాడులోని ప్రముఖ మురుగన్ ఆలయం అయిన తిరుచెందూర్ ఆలయానికి వెళ్ళింది ఈ సమయంలో ఆమెకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శనం చేయించారు.

Malvi Malhotra: మాల్వి మల్హోత్రా పై హత్యాయత్నం.. ఏకంగా మూడు కత్తి పోట్లు.. ఎందుకో తెలుసా?

దర్శనమైన తర్వాత బయటకు వస్తున్న సమయంలో ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆ ఆలయంలోని సిబ్బంది పోటీపడ్డారు. అయితే పారిశుద్ధ్య సిబ్బంది ఆమె దగ్గరకు వచ్చి సెల్ఫీలు దిగే ప్రయత్నం చేయగా ఆమె తనకు దూరంగా ఉండమని సైగలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది రోజా మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత పారిశుద్ధ్య కార్మికులు ఏమైనా అంటరాని వారా? ఎందుకు రోజా ఇలా చేయాల్సి వచ్చింది అంటూ చాలామంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రోజా భర్త సెల్వమణి తమిళనాట ఒకప్పుడు పాపులర్ డైరెక్టర్ ఇప్పుడు సినిమాలను డైరెక్ట్ చేసే విషయంలో కాస్త వెనుకబడ్డారు.

Show comments