Site icon NTV Telugu

Rithu Chowdary: లవ్లో ఫెయిలైన జబర్దస్త్‌ భామ.. త్వరలో అన్నీ బయటపెడుతుందట!

Rithu Chowdary Breakup

Rithu Chowdary Breakup

Rithu Chowdary Love Failure: జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన అమ్మాయిల్లో రీతూ చౌదరి కూడా ఒకరు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ భామ ముందు సీరియల్స్ లో నటించి పాపులారిటీ తెచ్చుకుని తర్వాత జబర్దస్త్ కి వచ్చి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ నోటెడ్ అయ్యేలా అనేక స్కిట్స్ లో కనిపించింది. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తూ వస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన అభిమానులతో పెట్టిన ముచ్చట్లు కొత్త చర్చకు దారి తీశాయి. నిజానికి గత ఏడాది రీతూ చౌదరి శ్రీకాంత్‌ అనే వ్యక్తితో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ ప్రేమకు సంబంధించిన కొటేషన్లు షేర్ చేయడంతో ఆమె లవ్‌లో పడిందని పెళ్లి కూడా చేసుకోబోతుంది అనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అని కూడా ఒక ఫోటో కూడా లీకైంది. ఆ తర్వాత వీరు కలిసి సోషల్ మీడియాలో కనిపించనేలేదు.

Bro 1st Day Collections: దుమ్మురేపే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న బ్రో..

రీతూ తండ్రి చనిపోయినా ఆ తరువాత కూడా వారు కలిసున్న ఫొటోలు కానీ వీడియోలు కానీ బయటకు రాలేదు. ఇక ఆ తరువాత రీతూ అతడితో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో డిలీట్‌ చేయడంతో కొత్త చర్చలు జరుగుతున్నాయి. యితే తాజాగా ఈ చర్చలకు మరింత ఊతం ఇచ్చేలా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ‘నిజాలు మాట్లాడుకుందాం’ అంటూ చిట్‌చాట్‌ నిర్వహించిన క్రమంలో ఆమె సమాధానాలు చెప్పింది. పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు అసలు పెళ్ళి తీసుకోకపోవడమే మంచిదని పేర్కొన్న ఆమె అప్పుడే సంతోషంగా ఉండొచ్చని చెప్పింది. ఇక శ్రీకాంత్‌తో మాట్లాడట్లేదా? అని అడిగితే లేదని, ఈ విషయం అంతా త్వరలోనే వివరంగా చెప్తానని చెప్పుకొచ్చింది. ఇక నీకు లవర్ ఉన్నాడా? అనే ప్రశ్నకు ‘లవ్వుకో దండం పెట్టిసింది, మీరు బాగున్నారు పెళ్ళెప్పుడు అంటే ఏమో అని ఆమె చెప్పుకొచ్చింది. ఇంకేముంది శ్రీకాంత్ తో ఆమె విడిపోయిందని బ్రేకప్‌ అయి ఉంటుందని ఆమె చెబుతాను అంటుంది కాబట్టి వెయిట్ చేద్దామని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Exit mobile version