Site icon NTV Telugu

Rekha Boj : కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

Rekha Boj

Rekha Boj

Rekha Boj : కాంట్రవర్సీ బ్యూటీ రేఖా భోజ్ గురించి ప్రత్యేకంగ పరిచయం అవసరం లేదు. ఆమె చేసిని సినిమాలు చాలా తక్కువే అయినా చేసే కామెంట్లు మాత్రం ఓ రేంజ్ లో ఓ కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఆమె చేసే సోషల్ మీడియా పోస్టులు అలా ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. నేను సినిమాల్లో నటించేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాను. గతంలో నేను సామి సామి అనే కవర్ సాంగ్ చేశాను. దాని కోసం నా రెండు బంగారు గాజులు అమ్ముకున్నాను. అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. దాని వల్లే ఓ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలా ఇండస్ట్రీలో నాకు గుర్తింపు లభించింది.

Read Also : Pawan Kalyan : వాళ్లను చూసి పవన్ కల్యాణ్‌ సిగ్గుపడ్డారు.. సమంత షాకింగ్ కామెంట్స్

నాకు సినిమాల్లో పెద్దగా ఛాన్సులు రావట్లేదు. కానీ నటనను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అవసరం అయితే నా కిడ్నీ అమ్ముకుని అయినా సొంతంగా సినిమా చేస్తాను. నాకు గత మూడేళ్ల నుంచి ఎన్నో కమిట్ మెంట్ ఆఫర్లు ఇస్తున్నారు. వాళ్లకు కమిట్ మెంట్ ఇస్తే బిల్డింగ్ ఇస్తాం, కారు ఇస్తాం, ఫ్లాట్ ఇస్తాం అంటున్నారు. నేను వాటిని రిజెక్ట్ చేస్తూ వస్తున్నాను. ఒకవేళ వాళ్లు అడిగినట్టే నేను కమిట్ మెంట్ ఇచ్చి ఉంటే ఈ పాటికి సెటిల్ అయిపోయేదాన్ని. కానీ నాకు అలా సెటిల్ కావడం ఇష్టం లేదు. నా సొంత ట్యాలెంట్ తోనే సంపాదించుకుంటాను. ఇప్పటికీ నేను నిజాయితీగా ఉంటున్నాను కాబట్టే నా దగ్గర పెద్దగా డబ్బులు లేవు అంటూ తెలిపింది రేఖ.

Read Also : Rithika Nayak : లంగాఓణీలో రితిక నాయక్ మెరుపులు..

Exit mobile version