NTV Telugu Site icon

Ranjana Naachiyar: బస్సు ఆపి స్కూల్ పిల్లల్ని కొట్టిన నటి అరెస్ట్

Ranjana Naachiyar

Ranjana Naachiyar

Actress Ranjana Naachiyar Arrested: బస్సు ఫుట్‌బోర్డ్‌కు వేలాడుతూ ప్రయాణిస్తున్న విద్యార్థులను కొట్టిన తమిళ నటి, బీజేపీ నాయకురాలు రంజనా నాచ్చియార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు ఫుట్‌బోర్డ్‌పై నిలబడి ప్రయాణిస్తున్న విద్యార్థులను రంజనా ఫాలో అయి వారిని ఒక్కొక్కరిని బయటకు లాగి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. పోలీసులు రంజనాను ఆమె నివాసంలో అరెస్టు చేసి, పిల్లలను వేధించినందుకు, బస్సు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినందుకు నటిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన చెన్నైలోని కెరుంబాక్కంలో గత రోజు జరిగింది. కుంట్రత్తూరు నుంచి పోరూర్‌కు వెళ్తున్న బస్సులో విద్యార్థులు ఒక్క కాలుతో వెనుక ఫుట్‌బోర్డ్‌కు వేలాడుతున్నారు. తర్వాత కారులో వెనుకనే వచ్చిన రంజన ఇది చూసి బస్సును ఆపింది.

Shah Rukh Khan: షారుక్ ఖాన్ పుట్టినరోజు కదాని ఇంటికెళ్తే 30 ఫోన్లు కొట్టేశారు.. ముగ్గురి అరెస్ట్!

న్యాయవాది అయిన రంజన.. మీరు ఈ విధంగా ప్రయాణిస్తున్న విద్యార్థులను అడ్డుకోలేకపోయారా అని డ్రైవర్‌ను ప్రశ్నించి, పిల్లలను కిందకు దించాలని సూచించారు. ఫుటేజీలో, వెనుకాడిన వారిని క్రిందికి లాగి, ప్రతిఘటించిన వారిని కొట్టారు. తనపై అరిచిన వారిని కుక్కలు అని ఆమె అనడం కూడా ఆ వీడియోలో పిలవడం కూడా వినిపిస్తోంది. కాగా, రంజనాపై కేసు పెట్టవద్దని బీజేపీ నేత సి.టి. రవి కోరారు. ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న పాఠశాల విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేయని ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి, అధికారులపై కేసు పెట్టాలని రవి అన్నారు. రంజనాను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని రవి డిమాండ్ చేశారు. రంజనా నాచియార్ బిల్లా పండి, సుకుమారిన్ శబదం, మయం లాంటి తమిళ సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు అయితే దక్కలేదు.