NTV Telugu Site icon

Ramya Krishna: రోజాకు రమ్యకృష్ణ మద్దతు.. తీవ్ర ఆవేదన కలిగిందంటూ వీడియో

Ramya Krishna Reacts On Bandra Satyanarayana Comments

Ramya Krishna Reacts On Bandra Satyanarayana Comments

Actress Ramya Krishna Reacts on Bandaru Satyanarayana Comments on Roja : మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పై సినీ నటి రమ్య కృష్ణ స్పందించారు. రోజాకు మద్దతు ప్రకటించిన రమ్యకృష్ణ టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ….రోజా పై చేసిన అసభ్య వ్యాఖ్యలు నాకు తీవ్ర ఆవేదన కలిగించాయని అన్నారు. ఇవి రోజాను మాత్రమే కాదు ఆమె కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయటమే అని పేర్కొన్న ఆమె అందరు మహిళలపై జరుగుతున్న శారీరక, మానసిక హింసను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఈ ఘటన పై స్పందించాలని పేర్కొన్న బండారు సత్యనారాయణ పై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ మేరకు రమ్యకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు.

Jagapathi Babu: నా అభిమానులే ఇబ్బంది పెడుతున్నారు.. జగపతి బాబు సంచలన ప్రకటన

రోజాని బండారు సత్యనారాయణ అసభ్యకరంగా దూషించడం దారుణమని, మన దేశంలో మాత్రమే భారత మాతకీ జై అని గర్వంగా చెప్తామని.. అలాంటి దేశంలో ఓ మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ ఆమె కామెంట్ చేశారు. బండారు సత్యనారాయణని క్షమించకూడని నేరమని మన దేశం ప్రపంచంలోనే 5వ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోందని అలాంటి దేశంలో ఓ మహిళా మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రమ్యకృష్ణ. కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్‌తో సంబంధం లేకుండా బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యలు ఖండించాలని, తాను మహిళగా, నటిగా, స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటానని అన్నారు. ఈ దేశంలో మహిళలపై రేప్‌లు, దాడులు, గృహ హింస, బహిరంగ దూషణ ఇప్పటికీ కొనసాగడం బాధాకరమన్న ఆమె బండారు చేసిన వ్యాఖ్యల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.