Ramya Krishna: రోజాకు రమ్యకృష్ణ మద్దతు.. తీవ్ర ఆవేదన కలిగిందంటూ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Ramya Krishna Reacts on Bandaru Satyanarayana Comments on Roja : మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పై సినీ నటి రమ్య కృష్ణ స్పందించారు. రోజాకు మద్దతు ప్రకటించిన రమ్యకృష్ణ టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ….రోజా పై చేసిన అసభ్య వ్యాఖ్యలు నాకు తీవ్ర ఆవేదన కలిగించాయని అన్నారు. ఇవి రోజాను మాత్రమే కాదు ఆమె కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయటమే అని పేర్కొన్న ఆమె అందరు మహిళలపై జరుగుతున్న శారీరక, మానసిక హింసను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఈ ఘటన పై స్పందించాలని పేర్కొన్న బండారు సత్యనారాయణ పై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ మేరకు రమ్యకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు.
Jagapathi Babu: నా అభిమానులే ఇబ్బంది పెడుతున్నారు.. జగపతి బాబు సంచలన ప్రకటన
Also Read
రోజాని బండారు సత్యనారాయణ అసభ్యకరంగా దూషించడం దారుణమని, మన దేశంలో మాత్రమే భారత మాతకీ జై అని గర్వంగా చెప్తామని.. అలాంటి దేశంలో ఓ మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ ఆమె కామెంట్ చేశారు. బండారు సత్యనారాయణని క్షమించకూడని నేరమని మన దేశం ప్రపంచంలోనే 5వ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోందని అలాంటి దేశంలో ఓ మహిళా మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రమ్యకృష్ణ. కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్‌తో సంబంధం లేకుండా బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యలు ఖండించాలని, తాను మహిళగా, నటిగా, స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటానని అన్నారు. ఈ దేశంలో మహిళలపై రేప్‌లు, దాడులు, గృహ హింస, బహిరంగ దూషణ ఇప్పటికీ కొనసాగడం బాధాకరమన్న ఆమె బండారు చేసిన వ్యాఖ్యల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!