Site icon NTV Telugu

Preetika Rao : ఆ నటుడు అమ్మాయి కనిపిస్తే వదలడు.. స్టార్ యాక్టర్ కామెంట్స్..

Preetika

Preetika

Preetika Rao : బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై ఎప్పుడూ ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. తాజాగా సీనియర్ నటి అమృత అరోరా చెల్లెలు అయిన నటి ప్రీతిక రావు సంచలన కామెంట్లు చేసింది. ఆమె 2013లో హిందీలో వచ్చిన బెయింటెహా అనే సీరియల్ లోహర్షద్‌ కు జంటగా నటించింది. అయితే ఆ సీరియల్ కు సంబంధించిన సీన్లను కొన్నింటికి తాజాగా ఓ నెటిజన్ ఇన్ స్టాలో పోస్టు చేశారు. వరుసగా అందులోని రొమాంటిక్ సీన్లను పోస్టు చేయడంతో ప్రీతికకు నచ్చలేదు. వద్దు అని చెప్పింది. దానికి ఆ నెటిజన్.. ఆ సీరియల్ లో నటించినప్పుడు లేదు గానీ.. నేను పోస్టు చేస్తుంటే నీకు నచ్చట్లేదా అంటూ ప్రశ్నించాడు.

Read Also : MMTS Train Case: ఎంఎంటీఎస్‌ ట్రైన్ అత్యాచార యత్నం కేసులో సంచలనం

దీనికి ప్రీతికరావు చాలా సీరియస్ గా స్పందించింది. ‘నీకు అసలు బుద్ధి లేదా.. ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదా. నటుడు హర్షద్ చాలా చెడ్డవాడు. ఇండస్ట్రీలోకి ఎవరు కొత్తగా వస్తే వారితో పడక పంచుకోవాలని చూస్తాడు. అలాంటి వ్యక్తితో నన్ను పోలుస్తావా. ఆ ఆ సీరియల్ లో అప్పటికప్పుడు ఆ సీన్లు నాతో చేయించారు. కావాలని చేయలేదు. అందులో 95 శాతం మంచి సీన్లు ఉంటాయి. 5 శాతం మాత్రమే రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. నీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదు. ఇంతకు ఇంత అనుభవిస్తావు. నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది. నాకు నచ్చని పనులు చేయకు’ అంటూ శపించేసింది. ఆమె చేసిన చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version