NTV Telugu Site icon

Prachi Thaker: కమిట్‌మెంట్ ఇస్తే, రెండు లక్షలిస్తానన్నాడు.. కాస్టింగ్‌ కౌచ్‌పై నటి షాకింగ్ కామెంట్స్

Prachi Thaker

Prachi Thaker

Actress Prachi Thaker Talks About Her Casting Couch Experience: అప్పట్లో ‘మీటూ ఉద్యమం’ చిత్రపరిశ్రమలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పు కారణంగా.. నటీమణులు ఒక్కొక్కరుగా బయటకొచ్చి, ఇండస్ట్రీలోని చీకటి కోణాల్ని బయటపెడుతున్నారు. కెరీర్ ప్రారంభంలో తమకు ఎదురైన చేదు అనుభవాల్ని పంచుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా నటి ప్రాచీ ఠాకర్ కూడా తనకెదురైన బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది. కమిట్‌మెంట్ ఇస్తే, ఒక వ్యక్తి తనకు రూ.2 లక్షలిస్తానని చెప్పాడని.. తాను ఒప్పుకోకపోవడంతో ఒక ఆఫర్ కోల్పోయానని తన ఆవేదన వ్యక్తం చేసింది.

Mahesh Babu: మహేష్ బాబు దగ్గర ఎన్ని ఖరీదైన కార్లు ఉన్నాయో తెలుసా?

ఓ ఇంటర్వ్యూలో ప్రాచీ ఠాకర్ మాట్లాడుతూ.. ‘‘పటాస్ సినిమా చేసిన తర్వాత ఒక యాడ్‌ ఏజెన్సీ వాళ్లు నన్ను సంప్రదించారు. ఒక యాడ్‌ చేయమని వాళ్లు అడిగితే, అందుకు సరేనన్నాను. అయితే.. నాకు తెలుగు భాష సరిగ్గా రాదు కాబట్టి, మీడియేటర్‌గా తెలుగు స్నేహితుడిని నియమించుకున్నాను. ఆ ఏజెన్సీతో మీటింగ్స్‌ బాగానే జరిగాయి. అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. నాతో ఈ యాడ్ డీల్ మాట్లాడిన వ్యక్తి, నా ఫోన్ నంబర్ తీసుకున్నాడు. షూటింగ్ ఎప్పుడు ఉంటుందో చెప్తానని అన్నాడు. ‘మరి మీరు కమిట్‌మెంట్‌ ఇస్తున్నారు కదా’ అని అన్నాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు. బహుశా యాడ్ షూట్ గురించి అంటున్నాడేమోనని అనుకొని, ఎప్పుడు షూట్ ఉంటే ఆరోజే కమిట్‌మెంట్ ఇస్తానని సమాధానం ఇచ్చాను’’.

Ileana : పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన గోవా బ్యూటీ..

‘‘అది కాదు, కమిట్‌మెంట్‌కు నువ్వు రెడీనే కదా? అని మరోసారి అడిగాడు. నువ్వు డేట్‌ చెప్పు, కచ్చితంగా ఆరోజు షూట్‌కి వచ్చేస్తానని మళ్లీ సమాధానం ఇచ్చాను. అప్పుడతను.. ‘మేటర్ అది కాదు, నాకో పార్ట్‌నర్ ఉన్నాడు, అతనితో కాంప్రమైజ్ అవుతావా, నీకు రెండు లక్షలిస్తా’ అని చెప్పాడు. నాకు సరిగ్గా అర్థం కాకపోవడంతో, ఆ సంభాషణను స్క్రీన్‌షాట్‌ తీసి నా ఫ్రెండ్‌కు పంపించాను. అప్పుడామె నాకు వివరంగా చెప్పింది. అసలు విషయం అర్థం కావడంతో చాలా బాధేసింది. మరో దారి లేక ఆ యాడ్ కూడా చేయనని తెగేసి చెప్పా’’ అంటూ ప్రాచీ ఠాకర్ చెప్పుకొచ్చింది. కాగా.. రాజుగారి కోడి పులావ్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రాచీ.. పటాస్ సినిమాతో మంచి పేరు సంపాదించింది.