NTV Telugu Site icon

Sardar 2: సర్దార్ 2లో ప్రభాస్ హీరోయిన్

Sardar 2

Sardar 2

Malavika Mohanan has roped in to play the female lead in Sardar2: కోలీవుడ్ స్టార్ హీరోలో హీరో కార్తీ కి సపరేట్ గుర్తింపు ఉంటుంది. డిఫ్రెంట్ స్క్రిప్ట్ సెలక్షన్ తో డిఫ్రెంట్ లుక్స్ తో ఫిల్మ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మార్క్ సెట్ చేసాడు. ఇప్పటికి 25 చిత్రాలను పూర్తి చేసిన ఈయన ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం సర్ధార్‌ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఇంతకు ముందు నటించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ సర్ధార్‌ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 2022లో విడుదలై ఈ చిత్రం సూపర్‌హిట్‌ అయ్యింది. కాగా కార్తీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఆ చిత్రంలో నటి రాశీఖన్నా, రజీషా విజయన్‌ హీరోయిన్లుగానూ నటి లైలా ముఖ్య పాత్రలోనూ నటించారు.

Also Read: Kerala Landslide: టాలీవుడ్ నుంచి మొదటి విరాళం ప్రకటించిన నాగవంశీ

సర్దార్ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ పీఎస్‌.మిత్రన్‌నే సర్ధార్‌ 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సర్ధార్‌ చిత్రాన్ని నిర్మించిన ప్రిన్స్‌ పిక్చర్స్‌ సంస్థ అధినేత ఎస్‌.లక్ష్మణన్‌నే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా పోతే ఇందులో సర్ధార్‌ చిత్రంలో నటించిన రాశీఖన్నా, గానీ, రజీషా విజయన్‌ గానీ,లైలా గానీ నటించడం లేదు. ఇందులో ముగ్గురు కథానాయికలు నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే హీరోయిన్ల్ గ ప్రియాంక మోహన్, ఆషికా రఘునాథ్‌ నటిస్తుండగా తాజాగా ఇంకో హీరోయిన్ నటిస్తుంది అంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ చిత్రంలో కథానాయికగా నటి మాళవిక మోహనన్ తీసుకోవడం జరిగింది అంటు అధికారంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈమె రెబెల్ స్టార్ ప్రభాస్ తో రాజాసాబ్ అనే మూవీలో నటించనుంది. మారుతీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్ గ స్క్రీన్ పంచుకోనుంది. ఇకపోతే ఇందులో నటుడు ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. జీవీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని, జార్జ్‌ సీ.విలియమ్స్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.