NTV Telugu Site icon

Malavika Mohanan: ఈ ప్రభాస్ హీరోయిన్ చాలా ట్రెండీ గురూ…

Malavaika Mohanan

Malavaika Mohanan

దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన తమిళ్ డబ్బింగ్ ‘మాస్టర్’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘కేయు మోహనన్’ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన మాళవిక మాస్టర్ సినిమాలో లెక్చరర్ రోల్ ప్లే చేసింది కాబట్టి మాళవిక మోహనన్ చీరలు కట్టుకోని చాలా ట్రెడిషనల్ గా కనిపించింది. పాత్ర కోసం తెరపై అలా కనిపించింది కానీ మాళవిక మోహనన్ ట్రెడిషనల్ కాదు మోస్ట్ ట్రెండీ హీరోయిన్ అనే చెప్పాలి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మాళవిక పోస్ట్ చేసే ఫొటోస్ చూస్తే చాలు “మేడమ్ చాలా హాట్ గురూ, మేడమ్ చాలా ట్రెండీ గురూ” అని ఎవరైనా అనాల్సిందే.

Read Also: Prabhas: ఆదిపురుష్ ఆల్ షోస్ హౌజ్ ఫుల్… అప్పుడే బోర్డు పెట్టేసారు

లేటెస్ట్ గా ‘ఆఫ్ బ్లూస్’ అంటూ ట్విట్టర్ లో మాళవిక మోహనన్ కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. ఈ ఫొటోస్ లో మాళవిక చాలా స్టైల్ గా కనిపిస్తోంది. స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్న మాళవిక మోహనన్ డైరెక్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మలయాళ కుట్టి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతీ తెరకెక్కిస్తున్న సినిమాలో మెయిన్ లీడ్ గా నటిస్తోంది. హారర్ కామెడి జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో మాళవిక మోహనన్ తెలుగుతో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి కూడా వెళ్ళబోతుంది. మంచి హైట్, పర్ఫెక్ట్ గ్లామర్ ని మైంటైన్ చేసే మాళవిక, ప్రభాస్ పక్కన మంచి పెయిర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి మొదటి సినిమాతో ఈ మలయాళ బ్యూటీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Show comments