Site icon NTV Telugu

Lavanya Tripathi: గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు.. తమ వారసత్వం అంటూ

Lav

Lav

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తనకు మేనల్లుడు పుట్టినట్లు చెప్పుకొచ్చింది. ఇక చిన్నారి వీడియోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. త్రిపాఠి కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయని, తన త్రిపాఠి వంశ పారపర్యాన్ని తన మేనల్లుడు కంటిన్యూ చేశాడని చెప్పుకొచ్చింది.. తనలానే తన మేనల్లుడుకు కూడా సొట్టబుగ్గలు పడుతున్నాయని సంతోషపడుతూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో అభిమానులందరూ.. సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి త్రిపాఠి ఇంట్లో పండంటి బిడ్డ రాకతో అందరూ సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.

ఇక లావణ్య గురించి చెప్పాలంటే.. గతేడాది.. ఈ చిన్నది మెగా ఇంట కోడలిగా అడుగుపెట్టింది. వరుణ్ తేజ్ తో మూడు ముళ్లు వేయించుకున్న ఈ భామ.. ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది. పెళ్లి తరువాత లావణ్య సినిమాలకు బ్రేక్ ఇస్తుందేమో అనుకున్నారు కానీ, ఆమె మాత్రం వెబ్ సిరీస్ లతో బిజీగా మారింది. తన మొదటి వెబ్ సిరీస్ పులి మేక హిట్ అవ్వడంతో ప్రస్తుతం మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సిరీస్ తో మెగా కోడలు విజయాన్ని అందుకొని.. వెబ్ సిరీస్ లను కంటిన్యూ చేస్తుందా.. ? సినిమా ఛాన్స్ లను అందుకుంటుందా.. ? అనేది చూడాలి.

Exit mobile version