NTV Telugu Site icon

Adi Pinisetty: లైలా… ఈసారి ఏ మేరకు ‘శబ్దం’ చేస్తుందో!?

Laila1

Laila1

Laila: ‘ఎగిరే పావురమా’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సొట్టబుట్టల సోయగం లైలా… ఆ తర్వాత దక్షిణాదిలో వివిధ భాషల్లో దాదాపు 40 చిత్రాలలో నటించింది. వివాహానంతరం గ్యాప్ తీసుకున్న ఆమె… మళ్ళీ పదిహేనేళ్ళ తర్వాత కార్తీ ‘సర్దార్’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు… తెలుగులో ఓ ప్రముఖ ఛానెల్ లోని షోలో జడ్జిగానూ వ్యవహరించింది. ఈ ఎంట్రీలో బుల్లితెరతో పాటు వెండితెరపైనా లైలా కాన్సంట్రేషన్ చేస్తోంది. తాజాగా ఆమె ఆది పినిశెట్టితో ‘వైశాలి’ ఫేమ్ అరివళగన్ తెరకెక్కిస్తున్న ‘శబ్దం’ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీని 7జి ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి నిర్మించనుండగా, ఎస్. భానుప్రియ శివ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ‘శబ్దం’లో కథానాయికగా లక్ష్మి మీనన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లైలా కీలక పాత్ర పోషిస్తున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇందులో మునుపెన్నడూ చూడని పాత్రలో లైలా కనిపించబోతోందని తెలిపారు. అరుణ్ పద్మనాభన్ కెమెరామెన్ గా పని చేస్తుండగా, స్టార్ కంపోజర్ ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సాబు జోసెఫ్ ఎడిటర్ గా, మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. మరి ఈ ‘శబ్దం’తో లైలా తమిళ, తెలుగు భాషా చిత్రాల్లో ఏపాటి శబ్దం చేస్తుందో చూడాలి.

Show comments