NTV Telugu Site icon

Kasturi: ఇంటింటి గృహలక్ష్మి హీరోయిన్ కు అస్వస్థత.. బుద్దిలేదు అని తిట్టిపోస్తున్న అభిమానులు

Kasturi

Kasturi

Kasturi: పచ్చని చిలకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే.. భూలోకమే ఆనందానికి ఇల్లు.. ఈ సాంగ్ ను తెలుగువారు ఎప్పటికి మర్చిపోలేరు. ఆ వీడియోలో ఉన్న కస్తూరిని కూడా అంత త్వరగా మర్చిపోలేరు. అమాయకమైన మోము.. అదరగొట్టే చలాకీతనం అన్నింటికీ మించి ఎవరికి భయపడకుండా తన మనసుకు ఏది అనిపిస్తే అది చెప్పడం, చేయడం కస్తూరికి ఉన్న అలవాటు. దీనివల్లనే ఆమె ఎన్నో వివాదాలలో ఇరుక్కుంది. అయినా కూడా ఇప్పటికీ సమాజంలో జరిగే అన్యాయాలను తన ట్వీట్స్ ద్వారా ఎండగడుతూ ఉంటుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా కస్తూరి.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తో బుల్లితెపై అలరిస్తోంది. గృహలక్ష్మి పాత్రలో ఆమె రెండు తెలుగు రాష్ట్రాలకు ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక తాజాగా ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. గత కొన్నిరోజులు క్రితం ఆమెకు అమ్మవారు( చికెన్ ఫాక్స్) పూసింది. ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చెప్పుకొచ్చింది.

“నాకు ఈ మధ్యనే చికెన్ ఫాక్స్ వచ్చింది. దానివలన శరీరం మొత్తం వికృతంగా మారింది. ఒంటినిండా ఆ మచ్చలు రావడంతో ఆ ఫేస్ మొత్తం మచ్చలతో నిండిపోయింది. ఇంకా నయం కళ్ళను మాత్రం ఈ చికెన్ ఫాక్స్ వదిలిపెట్టింది. అందుకు దానికి థాంక్స్ చెప్పాలి. ఎప్పటిలానే నా ఇన్స్టాగ్రామ్ అభిమానులు సపోర్ట్ నాకు ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎన్నో ఏళ్ళనుంచి నా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నా.. కానీ ఈ చికెన్ ఫాక్స్ వలన మొత్తం పోయింది.. ఈ వయస్సులో చికెన్ ఫాక్స్ రావడం వలన చాలామందికి ప్రాణహాని కూడా ఉంది” అని చెప్పుకొచ్చింది. అయితే కస్తూరి పోస్ట్ పై అభిమానులు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కొందరు చెప్తుంటే.. అమ్మవారు పోస్తే.. శరీరంపై మచ్చలు వచ్చాయని అసభ్యంగా తిడతావా.. బుద్ధి లేదు.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఏ ఈపోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments