NTV Telugu Site icon

Jayalalitha: ఆ డైరెక్టర్ నా కోసం విషం తాగి చస్తాను అని నా జీవితం నాశనం చేశాడు

Jayalalitha

Jayalalitha

Jayalalitha: టాలీవుడ్ లో ఒకనాటి అందాల తార జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన అందాలతో అప్పటి ప్రేక్షకులను మైమరిపించింది. ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ లో కూడా నటించి మెప్పిస్తుంది. ఇక జయలలిత ఎంత అందంగా ఉంటుందో ఆమె జీవితం ముళ్లబాటలా నడించింది. ముఖ్యంగా ఆమె వైవాహిక జీవితంలో ఎన్నో వేధింపులకు గురయ్యింది. ఈ విషయాన్నీ ఆమె ఏనాడూ మీడియా ముందు చెప్పలేదు. మొదటిసారి జయలలిత తన గోడును ఒక ఇంటర్వ్యూలో వెళ్లబోసుకుంది. ఇంద్రుడు చంద్రుడు సినిమాతో ఆమె ఇండస్ట్రీకి పరిచయమైంది. అప్పట్లో సపోర్టింగ్ రోల్స్, నెగెటివ్ రోల్స్ లో జయలలిత అద్భుతంగా నటించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె మలయాళ డైరెక్టర్ వినోద్ తో ప్రేమలో పడింది. ఆ తరువాత ఇంట్లో వాళ్ళను ఎదురించి అతడిని పెళ్లాడింది.

Nayanthara: ఇదెక్కడి కాంబో.. ప్రదీప్ సరసన నయన్..?

“అతనితో నేను 25 సినిమాలు చేశాను. ఒకసారి ఏదో గొడవ అయితే వినోద్ నన్ను సేవ్ చేశాడు. అలా నేను అతనికి కనెక్ట్ అయ్యాను. ఏడేళ్లు ప్రేమలోనే ఉన్నాం. ఆ తరువాత సడెన్ గా పెళ్లి, పెళ్లి అని ఫోర్స్ చేశాడు. మా ఇంట్లో అతగాడి వాలకం ఎవరికి నచ్చలేదు. దొంగకోళ్లు పట్టేవాడిలా ఉన్నాడు అతనితో పెళ్లి ఎందుకు అని చాలామంది చెప్పారు. కానీ ప్రేమ కదా.. బ్లడ్ తో లెటర్స్ రాయడం, విషం తాగి చనిపోతానని చెప్పి.. నా మనసు కరిగించేశాడు. ఇంట్లోవాళ్ళు ఒప్పుకోకపోతే నేనే.. దాచుకున్న డబ్బులతో పెళ్లి చీర కొనుక్కొని మరీ అతడిని పెళ్లాడాను. అయితే ఆ తరువాత నా కుటుంబ సభ్యులు.. నా ఆసి మొత్తాన్ని మా తల్లిదండ్రులు వారి పేరుమీద రాయించుకున్నారు. అతడి మీద నమ్మకం లేక.. పిల్లలు పుట్టాకా ఇద్దరి పేరుమీద రాస్తామని చెప్పారు. అదే నాకు ఉపయోగపడింది. మేము ఆరు నెలలు కూడా కలిసి ఉండలేదు. డబ్బుకోసమే అతడు నన్ను పెళ్లిచేసుకున్నాడని అర్ధమయ్యింది. ఆ ఆస్థి మొత్తం నా దగ్గర నుంచి కొట్టేయాలని చాలా వేధించాడు. యాసిడ్ పోస్తాను అని, చంపేస్తానని చెప్పి వేధించాడు. చివరకు ఏడాది కూడా నిండకుండానే మేము విడిపోయాం. అప్పటినుంచి ఎవరైనా ప్రేమ కోసం చస్తా.. అంటే చిరాకు వస్తుంది.. ఆ ప్రేమనే నా జీవితాన్ని నాశనం చేసింది” అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments