NTV Telugu Site icon

Actress Himaja: నన్ను ఇబ్బందులు పెట్టారు, ఘోరంగా ఏడ్చాను.. హిమజ షాకింగ్ కామెంట్స్

Himaja Bad Experience

Himaja Bad Experience

Actress Himaja Shared Her Bad Experience In Industry: కెరీర్ ప్రారంభంలో నటీనటులు.. ముఖ్యంగా అమ్మాయిలు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. బాడీ షేమింగ్, కాస్టింగ్ కౌచ్ వంటి వ్యవహారాలను దాటుకొని.. తమ ప్రస్థానాన్ని కొనసాగించాల్సి వస్తుంది. స్టార్ నటీమణులు సైతం ఆ దశ నుంచి వచ్చినవాళ్లే. ఎన్నో సమస్యల్ని అధగమించాకే వాళ్లు ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు. నటి హిమజ సైతం అలాంటి చేదు అనుభవాలనే ఎదుర్కున్నట్టు వెల్లడించింది. తనని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని.. వాటిని భరించలేక ఘోరంగా ఏడ్చిన రోజులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

World’s Shortest Bodybuilder: ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్‌.. ఓ ఇంటివాడయ్యాడు..

ఓ మీడియాతో హిమజ మాట్లాడుతూ.. ‘‘నేను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్నాను. నా కళ్లు, నడక బాగోలేదని హేళన చేశారు. చివరికి దర్శకులు సైతం తనని ఎగతాళి చేశారు. కళ్లు చిన్నగా ఉన్నాయి, క్యారెక్టర్‌కు సూటవుతావో లేదోనని ముఖం మీదే అనేవాళ్లు. కానీ.. మేకప్ వేసిన తర్వాత నా కళ్లే హైలైట్ అయ్యేవి. నా కళ్లు చాలా బాగుంటాయని ప్రశంసలు కూడా అందాయి. నేను చెప్పేది ఒక్కటే.. ప్రతీసారి మనం సొసైటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు ఏది కరెక్ట్ అనిపిస్తే.. అది చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవాలి’’ అంటూ చెప్పుకొచ్చింది.

Aditi Rao Hydari: అనార్కలిగా న‌టించ‌టం.. హ్యాపీగా, చాలెంజింగ్‌గా అనిపించింది

అంతేకాదు.. తన డ్రైవర్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారి బాధ్యత కూడా తానే తీసుకున్నానని హిమజ వెల్లడించింది. వారికి వీలైనంత సహాయం చేసి, ఆ తర్వాత మిగతా వాళ్ల కోసం ఆలోచిస్తానని తెలిపింది. కాగా.. బుల్లితెర, వెండితెరలపై సందడి చేసే సెలెబ్రిటీల్లో హిమజ ఒకరు. బిగ్‌బాస్ మూడో సీజన్‌తో ఈమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ బిగ్‌బాస్ పుణ్యమా అని ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు.

Show comments