Site icon NTV Telugu

Actress Hema: ‘మా’ నుంచి హేమ సస్పెన్షన్?

Hema Suspended From Maa

Hema Suspended From Maa

Actress Hema Suspended from MAA: బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయిన సరే తాను హైదరాబాదులో ఉన్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేసి పెను వివాదానికి కారణమైంది నటి హేమ. బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో తన పేరును కృష్ణవేణిగా నమోదు చేసిన ఆమె తన అసలు బెంగళూరు వెళ్ళలేదు అని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఎట్టకేలకు పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టి ఆమె మీద డ్రగ్స్ కేసుతో పాటు కేసును తప్పు దోవ పట్టిస్తుందని మరో కేసు కూడా నమోదు చేశారు. ఇక రెండుసార్లు విచారణకు హాజరు కాకుండా వాయిదా వేసే ప్రయత్నం చేసిన ఆమెను హైదరాబాద్ వచ్చి విచారించి మరి అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి హేమకు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ కూడా కోర్టు విధించింది.

JR NTR: ఎన్టీఆర్ శుభాకాంక్షలు.. గాడిలో పెడతామంటూ బాలయ్య చిన్నల్లుడి రిప్లై

అయితే ఈ సందర్భంగా ఆమెను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద ప్రెషర్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మూవీ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెను అసోసియేషన్ లో ఉంచాలా లేక సస్పెండ్ చేయాలా అనే విషయం మీద అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో ఒక పోల్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే అందులో ఎక్కువ మంది ఆమెను సస్పెండ్ చేయాల్సిందిగా ఓటు వేసినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ విషయం మీద ఎలాంటి అధికారిక సమాచారం లేదు కానీ రేపు అధికారికంగా ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Exit mobile version