NTV Telugu Site icon

Actress Hema: సుఖానికి అలవాటు అయ్యా.. అందుకే సినిమాలు మానేశా

Hema

Hema

Actress Hema: టాలీవుడ్ నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఆమె ఎన్నో మంచి పాత్రలు చేసి మెప్పించింది. ఇక మా ఎలక్షన్స్ లో హేమ చేసిన రచ్చ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే మా ఎలక్షన్స్ లో జరిగిన వివాదం వలనే హేమ బాగా ఫేమస్ అయ్యింది. స్టార్ హీరోల సినిమాలు అంటే ఖచ్చితంగా హేమ ఉండాల్సిందే.. అలాంటిది గత కొన్ని రోజులుగా హేమ ఏ సినిమాలోనూ కనిపించలేదు. దీంతో ఆమె సినిమాలు మానేసిందని వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఈ వార్తలపై హేమ స్పందించింది. ఇటీవలే జబర్దస్త్ నటుడు కిర్రాక్ ఆర్పీ మణికొండలో నెల్లూరు చేపల పులుసు కర్రీ పాయింట్ పెట్టిన విషయం తెల్సిందే. ఆ ఈవెంట్ కు హాజరైన హేమ తాను సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అన్నదానిపై క్లారిటీ ఇచ్చింది.

Nani: ప్రేమికుల రోజున హార్ట్ బ్రేక్.. పర్లేదు అబ్బాయిలు

“కొత్తగా బిజినెస్ పెట్టాను.. అది బాగా వర్క్ అవుట్ అయ్యింది. బిజినెస్ బాగా డెవలప్ అయ్యి, సంపాదించడం ఎక్కువై పోయి, సుఖపడడం అలవాటు అయ్యి, కష్టపడడానికి ఇష్టపడడం లేదు” అని చెప్పుకొచ్చింది. అయితే ఆ బిజినెస్ ఏంటి అనేది మాత్రం హేమ రివీల్ చేయలేదు. దీంతో అభిమానులు అప్పుడప్పుడైనా సినిమాల్లో కనిపించండి.. జనాలు మర్చిపోకుండా అని కొందరు.. ఇప్పటికైనా అర్ధం చేసుకున్నారు. మంచిగా బిజినెస్ చేసుకోండి అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.మరి ముందు ముందు రోజుల్లో హేమ ఏమైనా సినిమాల్లో కనిపిస్తుందో లేదో చూడాలి.