Site icon NTV Telugu

Celina Jaitly : క్షమాపణలు చెప్పను.. నా దేశం కోసమే నిలబడుతా.. హీరోయిన్ ప్రకటన

Celina

Celina

Celina Jaitly : ‘ఆపరేషన్ సిందూర్ ను పొగిడినందుకు తాజాగా ఓ హీరోయిన్ పై ట్రోల్స్ జరుగుతున్నాయి. వీటిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పేది లేదని.. నా దేశాన్నే పొగుడుతా’ అంటూ చెప్పింది. ఆమె ఎవరో కాదు హీరోయమిన్ సెలీనా జైట్లీ. ఆమె ఆపరేషన్ సిందూర్ ను పొగుడుతూ చేసిన కామెంట్స్ పై కొందరు ట్రోల్స్ చేశారు. క్షమాపణ చెప్పాలని.. లేదంటే అన్ ఫాలో చేస్తామంటూ బెదిరించారు. వీటిపై ఆమె స్పందిస్తూ.. ‘మీరేం చేసుకుంటారో చేసుకోండి. నేను మాత్రం నా దేశం కోసమే మాట్లాడుతాను. ఇండియన్ ఆర్మీకి ఎప్పుడూ మద్దతుగా ఉంటాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని ఒప్పుకోను’ అంటూ చెప్పింది.

Read Also : IND PAK War: ఇక దబిడి దిబిడే.. ఏ ఉగ్రదాడి జరిగినా యుద్దంగానే పరిగణిస్తాం..!

నా దేశం గురించి మాట్లాడితే నచ్చని వారు అన్ ఫాలో చేసుకోవచ్చు. దానికి నేను భయపడను. కొందరు కావాలనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పేదే లేదు. భారత్ మీద నాకున్న ప్రేమ ఎన్నటికీ తగ్గదు. నా దేశ సైనికుల వెంటే ఉంటాను. వాళ్లు కులం, మతం అడిగి మమ్మల్ని కాపాడట్లేదు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. అలాంటి వారి కోసం ఎప్పుడూ నిలబడతాను. జైహింద్‌’అంటూ సుదీర్ఘ పోస్టు పెట్టింది. ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ఆస్ట్రేలియాలో ఉంటుంది. అయినా మనసంతా భారత్ లో జరుగుతున్న పరిస్థితుల మీదనే ఉందని.. ఆపరేషన్ సిందూర్ అద్భుతం అంటూ పోస్ట్ పెట్టింది. దానిపై కొందరు ట్రోల్స్ చేయగా ఇలా స్పందించింది.

Read Also : Sri Vishnu : శ్రీ విష్ణు.. నిజంగానే కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్..!

Exit mobile version