Site icon NTV Telugu

Ashrita : రాజమౌళి నన్ను అలా చూపించారు.. బాహుబలి నటి కామెంట్స్..

Asritha

Asritha

Ashrita : బాహుబలి సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓ చరిత్ర. ఆ సినిమాలో నటించిన వారికి ఎనలేని గుర్తింపు లభించింది. ఇప్పటికీ ఆ సినిమా పేరు చెప్పుకుంటే చాలు వారిని గుర్తు పట్టేస్తారు. అలాంటి వారిలో నటి ఆశ్రిత కూడా ఒకరు. ఆమె ఈ సినిమాలో అనుష్క వదిన పాత్రలో నటించింది. ఆమెనే ఆశ్రిత వేమగంటి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘బాహుబలి సినిమా తీసే టైమ్ లో నా వయసు కేవలం 27 ఏళ్లు మాత్రమే. కానీ అందులో నన్ను చాలా పెద్ద దానిలాగా చూపించారు. నేను ప్లస్ సైజులో ఉండటం వల్ల అలా ఈజీగా కనిపించేశాను. రాజమౌళి గారి విజన్ చాలా బాగుంటుంది. ఆయన వల్లే నాకు చాలా పేరు వచ్చింది. కానీ ఆ తర్వాత కూడా నాకు అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయి.
Read Also : Nagachaithanya : సమంత పెట్ డాగ్ తో ఆడుకుంటున్న శోభిత..

నేను ప్లస్ సైజులో ఉండటం వల్లే నాకు ప్రాబ్లమ్ అయింది. ఎక్కువగా అలాంటి పాత్రలు రావడంతో చాలా ఇబ్బంది పడ్డాను. కానీ నా వయసు చాలా తక్కువే. నా కన్నా ఎక్కువ వయసు ఉన్న వారు నా కంటే చిన్న వయసు పాత్రల్లో ఒకే సినిమాలో చేస్తున్నారు. కానీ సినిమా అన్న తర్వాత అన్ని పాత్రల్లో నటించాలని అందరూ నన్ను కన్విన్స్ చేస్తున్నారు. అందుకే ఇలాంటి పాత్రలో కూడా నటించేందుకు ఒప్పుకుంటున్నాను. నేను ఎమ్ సీఏ, క్రాక్, డియర్ కామ్రేడ్, యాత్ర, యానిమల్ లాంటి సినిమాలతో నాకు మంచి గుర్తింపు వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

Exit mobile version