అఫ్గానిస్థాన్ లో చోటు చేసుకున్న సంక్షోభం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఆ దేశం తాలిబన్ల రాజ్యం కావటంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే ఈ కారణంగా బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అర్షి ఖాన్ తన నిశ్చితార్ధాన్ని రద్దుచేసుకొంది. ఈ ఏడాది అక్టోబర్‌లో అఫ్గనిస్తాన్ క్రికెటర్‌తో తన నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, తన నిర్ణయాన్ని మార్చుకొంది. అయితే నిశ్చితార్థం బ్రేక్ అయినప్పటికీ మేమిద్దరం మంచి మిత్రులుగానే ఉన్నామని ఆమె తెలిపింది. కాగా, ఈ సంక్షోభం ద్వారా తనకు ఓ విషయం అర్ధమైనట్లు చెప్పుకొచ్చింది. ‘నా జీవిత భాగస్వామి తప్పకుండా భారతీయ వ్యక్తే అయివుంటాడని’ అని తెలిపింది. తన ఫ్యామిలీకి సంబందించిన మూలాలు అఫ్ఘనిస్తాన్‌లో ఉన్నప్పటికీ.. తాను భారతీయ పౌరురాలినే చెప్పుకొచ్చింది.
అఫ్గాన్ సంక్షోభం: నటి నిశ్చితార్థం రద్దు.. భారతీయుడే కావాలట!

Arshi Khan