Vaishali Takkar: బాలీవుడ్ లో రోజురోజుకూ బలవన్మరణాలు ఎక్కువైపోతున్నాయి. డిప్రెషన్ తట్టుకోలేక కొంతమంది, ఆర్థిక ఇబ్బందులు తాళాల్లేక మరికొంతమంది చిన్న వయస్సులోనే ప్రాణాలను కోల్పోతున్నారు. ఇక చిత్ర పరిశ్రమనే షేక్ చేసిన మరణం.. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ ది. డిప్రెషన్ తట్టుకోలేక ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన సుశాంత్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఎప్పుడైతే స్టార్ హోదాను దక్కించుకున్నాడో అప్పటి నుంచి బాలీవుడ్ చేతిలో అవమానం పడుతూనే వచ్చాడు. ఇంకా అంతకంతకు బాలీవుడ్ మాఫియా అతడిని తొక్కేయడానికి ప్రయత్నించడం.. సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు చేయడం.. ఆ మత్తులో అతడితో ఎన్నో చేయకూడని పనులు చేయించడం చేయించి అతడు డిప్రెషన్ లో పడేలా చేశారు. చివరికి తనంతట తానే సూసైడ్ చేసుకొని చనిపోయేలా చేశారు.
ఇక తన స్నేహితుడిని బాలీవుడ్ మాఫియానే చంపేసిందని మీడియా ముందు భయం లేకుండా వెల్లడించింది సుశాంత్ బెస్ట్ ఫ్రెండ్ వైశాలి ఠక్కర్. సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్యే అని వాదించిన ఆమె కూడా నేడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇండోర్‌లోని తేజాజీ నగర్ పోలీస్ స్టేషన్ సాయిబాగ్ కాలనీలో ఉన్న తన ఇంట్లో వైశాలి ఠక్కర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మన్మోహిని, సూపర్ సిస్టర్స్, విష్ సహా అమృత్ సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్న వైశాలి మృతికి కారణం ప్రేమ విఫలమని చెప్పుకొస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆమెకు, మిస్టర్ ఆఫ్రికా టైటిల్ గెలుచుకున్న డాక్టర్ అభినందన్ సింగ్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ నిశ్చితార్థం కూడా ఎక్కువ రోజులు నిలబలేదు. విభేదాల వలన పెళ్లి కాకముందే ఈ జంట విడిపోయింది. ఇక దీని తరువాత వేరొకతని ప్రేమలో పడిన ఆమె అతడి చేతిలో మోసపోయినట్లు సూసైడ్ లెటర్ లో తెలిపింది. ఆ బాధను భరించలేకనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
