NTV Telugu Site icon

Suman: పవన్ సీఎం అవ్వాలని దేవుడు రాసిపెట్టి ఉంచాడు.. సుమన్ సంచలన వ్యాఖ్యలు

Suman

Suman

Suman: పవన్ కళ్యాణ్ .. పవర్ స్టార్ ట్యాగ్ వదిలి జనసేనాని అనే ట్యాగ్ తోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. పదేళ్ల నుంచి పవన్ కళ్యాణ్.. ఏపీ రాజకీయాల్లో ఏక్టివ్ గా ఉంటూ ప్రజలకు ఎంతో కొంత మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈసారి ఎన్నికల్లో పవన్ సీఎం అయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయని ఏపీ ప్రజలు చెప్పడం గమనార్హం. ఇక ఇంకోపక్క ఇండస్ట్రీలోని పెద్దలు సైతం పవన్ కళ్యాణ్ కు మద్దతు పలకడం విశేషం. తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదటి నుంచి సుమన్ కు, చిరంజీవికి మధ్య మనస్పర్థలు ఉన్నాయని వార్తలు రావడం వింటూనే ఉన్నాం. అయితే సుమన్ కానీ, చిరు కానీ ఏరోజు తగాదాలు ఉన్నట్లు బిహేవ్ చేయలేదు. ఈ రూమర్స్ ను వారు ఎప్పుడు ఖండిస్తూనే వస్తున్నారు.

Maniratnam: రాజమౌళిని విడవని మణిరత్నం!

ఇక తాజాగా ఒక కార్యక్రమంలో సుమన్.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ “సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిగా చెబుతున్నాను. పవన్ కు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. ఎక్కడకు వెళ్లినా ఆయన అభిమానులు ఉన్నారు. ఇది పవన్ అదృష్టం. రాజకీయమైనా, వ్యాపారమైనా కూడా ఆ దేవుడు రాసి పెట్టి ఉంచాలి.. మనం అంతా కూడా యాక్టర్లమే. ఆ దేవుడు మనకు కొన్ని రోజులు పాట కొన్ని పనులు అప్పగిస్తాడు. మీరు చేసే పని నేను చేయలేను.. నేను చేసే పని మీరు చేయలేరు. జీవితంలో ఆయన సీఎం అవ్వాలని దేవుడు రాసిపెట్టి ఉంచాడు. ఒడిశాలో నవీన్ పట్నాయక్‌ కంటిన్యూగా ఐదుసార్లు సీఎంగా ఉన్నారు.. కంటిన్యూగా 25 ఏళ్లు ఆయనే ఉన్నారు.. దేనికైనా ఒక ఎక్స్‌పైరీ టైం ఉంటుంది. ఆ టైమ్ వచ్చినప్పుడు వెళ్లిపోతోంది. సినిమాల విషయం వచ్చేసరికి ఆయనకు ఇప్పుడున్న ఫాలోయింగ్ ఇంక ఎవ్వరికీ లేదు.. ఆయనకు ఉంది.. కానీ, ఆయన ఎప్పుడు క్లిక్ అవుతారు.. ఆయనకు ఎప్పుడు ఆ స్థానం దక్కుతుంది.. ఆ సందర్భం ఎప్పుడు వస్తుంది.. క్యాస్ట్ ఈక్విషన్ సెట్ అవ్వాలి.. ఎప్పుడు చేయాలని జనాలు అనుకుంటారో.. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్యాలెన్స్ అవుతుంది.. ఈ మనిషి వస్తే వాళ్లంత ధైర్యంగా ఉంటారని ఎప్పుడు అనుకుంటారో అప్పుడు ఆయన అవుతారు.. ఓ నటుడిగా ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాను.. ఆరోగ్యం మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.