NTV Telugu Site icon

Suman: చావుబతుకుల మధ్య సుమన్.. క్లారిటీ ఇచ్చిన నటుడు

Suman

Suman

Suman: సోషల్ మీడియా వచ్చాకా ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు జరుగుతోంది. తమ వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఏ విషయాన్నీ ప్రజలకు చెప్తున్నారో.. వారికే తెలియడంలేదు. ఇక ప్రేక్షకులు కూడా అందులో నిజం ఎంత అబద్దం ఎంత అని చూడకుండా షేర్ చేస్తూ వైరల్ గా మార్చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ హద్దుమీరి ప్రవర్తిస్తున్నాయి. సెలబ్రిటీలు ఆసుపత్రిలో ఉన్నారని తెలియడం ఆలస్యం.. ఎవరో మృతిచెందిన ఫోటో ఒకటి తీసుకొని సినీ నటులు వచ్చినట్లు ఎడిట్ చేసి.. ఆ తారలకు మాలవేసి నానా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇటీవల విక్రమ్ కు ఇలాగే చేసి హంగామా చేశారు. దానిపై విక్రమ్ కూడా తనదైన రీతిలో స్పందించారు. ఇక మరికొన్ని యూట్యూబ్ ఛానెళ్లు అయితే బతికున్నవారిని చంపేసి మరీ చూపిస్తున్నారు. సీనియర్ సెలబ్రిటీస్ ను తమ వ్యూస్ కోసం చంపేసి.. వారికి ఇబ్బందులు కలగజేస్తున్నారు.

తాజాగా నటుడు సుమన్ చావుబతుకుల మధ్య ఉన్నాడంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ థంబ్ నెయిల్స్ పెట్టి పోస్ట్ చేశాయి. ఇక అవి నిజమో కాదో తెలియని కొంతమంది సుమన్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెట్టుకొచ్చారు. అది కాస్తా వైరల్ గా మారడంతో సుమన్ కు ఎంతోమంది ఫోన్ చేసి విసిగించారు. దీంతో సుమన్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. బతికున్నవారిని చంపేస్తున్నారు అంటూ యూట్యూబ్ ఛానెల్స్ పై మండిపడ్డారు. “నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను.. బెంగుళూరు లో జరిగే షూటింగ్ లో పాల్గొంటున్నాను. నా స్నేహితుల ద్వారా ఈ విషయం తెలియడంతో అభిమానులకు నిజం చెప్పడానికి మీడియా ముందుకు వచ్చాను. ఇలాంటి వార్తలు పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. నేను హైదరాబాద్ వచ్చినవెంటనే వారిపై పరువు నష్టం దావా వేస్తా.. వారిపై పోలీస్ కేసు పెడతా..” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సుమన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments