Actor Sudheer Babu Met Chandra babu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని టాలీవుడ్ హీరో ఒకరు కలవడం ఆసక్తికరంగా మారింది. సదరు టాలీవుడ్ హీరో ఇంకెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు. శివ మనసులో శృతి అనే సినిమాతో హీరోగా మారిన ఆయన టాలీవుడ్ లో డీసెంట్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ జూన్ 14వ తేదీన ఆయన హీరోగా నటించిన హరోం హర అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మొత్తం చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
Tollywood : గోవా లో ఎన్టీఆర్, ప్రగతి రిసార్ట్స్ లో అల్లు అర్జున్..?
1980 కాలం నాటి పీరియాడిక్ మూవీ అని చెబుతున్న ఈ సినిమాకి పెద్ద ఎత్తున యూనిట్ ప్రమోషన్స్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కుప్పం నుంచి పోటీ చేసి గెలుపొందిన చంద్రబాబు నాయుడుతో సుధీర్ బాబు భేటీ అయ్యారు. తన తోడల్లుడు మాజీ తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ తో కలిసి చంద్రబాబు దగ్గరికి వెళ్లిన సుధీర్ బాబు ఆయనతో కొద్దిసేపు పర్సనల్ గా మాట్లాడారు. ఇక దానికి సంబంధించిన వీడియోని సినిమా యూనిట్ రిలీజ్ చేయగా అది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గెలుపొందిన తర్వాత కలిసిన మొట్టమొదటి టాలీవుడ్ హీరోగా సుధీర్ బాబు నిలవనున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఇంతకు ముందే కలిసినా వారు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నేపథ్యంలో వాళ్లని టాలీవుడ్ హీరోలలో కలపలేము. అయితే బయట నుంచి రాజకీయాలకు సంబంధం లేని మొట్టమొదటి టాలీవుడ్ హీరోగా సుధీర్ బాబు నిలిచారు.