NTV Telugu Site icon

Shivaji : ఆ హీరోకు నా సలహా నచ్చలేదు.. శివాజీ షాకింగ్ కామెంట్స్

Shivaji

Shivaji

Shivaji : ఒకప్పటి హీరో శివాజీ ఇప్పుడు మళ్లీ తెరమీద మెరుస్తున్నారు. విభిన్న పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఓ హీరో మీద చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్ మూవీలో ఆయన మంగపతి పాత్రలో అదరగొట్టేశారు. ఈ మూవీ మంచి హిట్ కొట్టేసింది. మూవీ సక్సెస్ మీట్ లో శివాజీ మాట్లాడుతూ.. మంగపతి పాత్రతో తనకు సంతృప్తి కలిగిందన్నారు. ఇలాంటి పాత్రల కోసమే తాను ఇన్నాళ్లు వెయిట్ చేశానని చెప్పుకొచ్చారు. కేవలం తండ్రి పాత్రలు చేయకుండా వైవిధ్యభరిత పాత్రల్లో నటించాలని ఉందన్నారు.

Read Also : PM Modi: అతనే నా ఫేవరేట్ ప్లేయర్.. బెస్ట్ టీమ్ అదే

రీసెంట్ గా తన వద్దకు అలాంటి స్క్రిప్ట్ ఒకటి వచ్చిందని.. అందులో పాత్ర తనకు బాగా నచ్చిందన్నారు. ఆ పాత్రకు కొన్ని మార్పులు చేయమని తాను దర్శకుడికి చెప్పానని.. బహుషా ఆ మూవీ హీరోకు తన సలహా నచ్చలేదేమో.. అందుకే మళ్లీ ఆ స్క్రిప్టు తన వద్దకు రాలేదని చెప్పాడు శివాజీ. ఇక ముందు డైరెక్టర్లు తన వద్దకు ఇలాంటి మంగపతి పాత్రలతో వస్తారని ఆశిస్తున్నట్టు తెలిపాడు. 90స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తర్వాత తండ్రి పాత్రలు వస్తున్నా చేయట్లేదన్నారు. విభిన్నమైన విలన్ పాత్రలు చేయాలని భావిస్తున్నట్టు వివరించారు.