Actor Sivaji Comments about Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 పూర్తవ్వగానే జరిగిన గొడవలు పెద్ద చర్చకే దారి తీశాయి. ఇక పల్లవి ప్రశాంత్ అరెస్ట్ దెబ్బకి కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూలు ఏమీ ఇవ్వకుండానే ఉన్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీ బిగ్ బాస్ ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అని, దాని వల్ల తనకు చాలా ఓపిక వచ్చిందని చెప్పాడు. తనకు హౌస్ లో పల్లవి ప్రశాంత్, యావర్ బాగా కనెక్ట్ అయ్యారని అన్నాడు. అంతేకాక బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ వెంటనే జైలుకు వెళ్లిన క్రమంలో ఆ విషయం మీద కూడా శివాజీ స్పందించాడు. కొందరు ఆకతాయిలు చేసిన పని వల్ల ప్రశాంత్ శిక్ష అనుభవించాడు, ఇందులో అతని తప్పేం లేదని అందరికీ తెలుసు ఆ ఫ్యాన్స్ ఇలానే చేస్తే ప్రశాంత్ రోడ్డెక్కే పరిస్థితి వస్తుందని అన్నాడు.
Kaushal Manda: నా కోసం ఆర్మీ తయారు కావడం అదృష్టం.. రైట్ మూవీ మిస్ కావొద్దు!
అభిమానులు దయచేసి ఇలా చేయొద్దు అని రిక్వెస్ట్ చేశారు. అంతే కాకుండా ‘స్పై’ అనే పేరుతో తమ ఫ్రెండ్‌షిప్ పాపులర్ అయ్యింది కాబట్టి అదే పేరుతో ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని పనులు కూడా మొదలు పెట్టా, దానికి సంబంధించిన వివరాలు త్వరలో రివీల్ చేస్తా అని పేర్కొన్నాడు. అయితే ఆసక్తికర అంశం ఏమిటంటే ‘స్పా’ బ్యాచ్‌లో అందరికంటే అమర్‌దీప్ కాస్త బెటర్ అని షాకింగ్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. ఇక తన కుటుంబంతో సహా చాలామంది తనకే కప్ వస్తుందని అనుకున్నారని, తాను ఎలిమినేట్ అవడం చూసి ఆశ్చర్యపోయారని బయటపెట్టాడు శివాజీ. తనకు రాకపోయినా తన బిడ్డకు కప్ వచ్చిందని వెల్లడించాడు.