Site icon NTV Telugu

Siddarth: ‘యానిమల్’ సినిమా.. మగాళ్లపై సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు

Actor Siddharth takes a dig at Animal: రణబీర్ కపూర్ యానిమల్ సినిమా గురించి సిద్దార్థ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు కామెంట్ చేశారు. “యానిమల్ (జంతువు) అనే టైటిల్‌తో తీసిన సినిమాని వెళ్లి చూస్తారు కానీ, నా సినిమా చూసి ఇబ్బంది అంటున్నారు’’ అని నటుడు సిద్ధార్థ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘చిత్త- చిన్నా ‘ చిత్రానికి గానూ నటుడు సిద్ధార్థ్‌కు ఓ ప్రైవేట్‌ సంస్థ అవార్డు అందజేసింది.

Madhu Shalini: మధుశాలిని అందాలు అదరహో.. సమ్మర్ హీట్ మరింత పెంచేస్తోంది!

ఈ సందర్భంగా జరిగిన అవార్డు వేడుకలో నటుడు సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు అరుణ్ నా దగ్గరకు రావడంతో ‘చిన్నా’ సినిమా కథ వినలేక పోయా, చాలా బాధించింది. ముఖం వణికిపోతోంది, సినిమా చూసి నేను ఒక సారి అయినా కన్ను మూశానని ఏ అమ్మాయి కూడా అనలేదు. కానీ చాలా మంది పురుషులు ముందుకు వచ్చి, మగవాళ్లు చూడలేరని చెప్పారు. అలాంటి సినిమాలు నేను చూడను అన్నారు. వారు వెళ్లి ‘యానిమల్’ సినిమాను వీక్షించారు. కానీ నా చిత్రాన్ని చూసి వాళ్లు కంగారు పడ్డారు. ఇది ఆందోళన కాదు, అవమానం అంతకు మించి అపరాధం, అయితే పర్వాలేదు త్వరలో బాగుపడుతుంది’’ అన్నాడు. ఇక సిద్ధార్థ్ మాట్లాడిన ఈ వీడియోను చాలా మంది షేర్ చేస్తున్నారు.

Exit mobile version