Site icon NTV Telugu

Sheela Rajkumar: భర్తకి విడాకులిచ్చిన మరో నటి.. థాంక్స్ చెప్పి మరీ?

Sheela Raj Kumar

Sheela Raj Kumar

Actor Sheela Rajkumar Announces Separation with her Husband Thambi Chozhan: అనేక మంది నటీమణుల బాటలో తాను కూడా వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతున్నట్టు ‘మండేలా’, ‘ద్రౌపతి’ సహా పలు తమిళ సినిమాల్లో నటించిన షీలా రాజ్‌కుమార్‌ ప్రకటించారు. నటి షీలా 2016లో వచ్చిన ‘ఆరదు చినమ్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. భరతనాట్య కళాకారిణి అయిన ఆమె ‘కూతుపట్టరై’తో మొదలు పెట్టి పలు రంగస్థల నాటకాల్లో కూడా నటించారు. 2017లో విడుదలైన ‘డౌలెట్‌’ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత శివకార్తికేయన్ నటించిన ‘నమ్మ వితిత పిళ్లై’ చిత్రంలో చిన్న పాత్ర పోషించారు. మలయాళంలో వచ్చిన ‘కుంబళంగి నైట్స్‌’లో ఆమె కీలక పాత్ర పోషించారు. మోహన్ జి దర్శకత్వం వహించిన ‘ద్రౌపతి’ సినిమాతో హీరోయిన్ అయిన ఆమె అశ్విన్ దర్శకత్వం వహించిన యోగి బాబు ‘మండేలా’లో కూడా ఒక ప్రధాన పాత్ర పోషించింది.

Bandla Ganesh: ఎగ్జిట్ పోల్ కంటే ముందే నేను చెప్పా.. వచ్చేది కాంగ్రెస్

ఇటీవల విడుదలైన ‘జిగర్తండా డబుల్ ఎక్స్’ చిత్రంలో కూడా లూర్దు అనే పాత్రలో కనిపించారు. ఇక ఈ నేపథ్యంలో నటి షీలా తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతున్నట్లు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించింది. తన భర్త అకౌంట్ ట్యాగ్ చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది. షీలా తన భర్తతో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియా పేజీ నుండి తొలగించింది. యాక్టింగ్ స్కూల్ నడుపుతున్న చోళన్‌తో ఆమెకు ప్రేమ వివాహం జరిగింది. వైవాహిక సంబంధాన్ని విడిచిపెడుతున్నట్లు పోస్ట్ చేస్తూ థాంక్స్ అండ్ లవ్ చోళన్” అని కూడా పేర్కొన్నారు. అయితే వీరు వివాహ బంధం నుంచి వైదొలగడానికి గల కారణాలేమిటో తెలియరాలేదు. సినీ పరిశ్రమలోని వ్యక్తులు వరుసగా విడాకులు తీసుకోవడం అభిమానులను షాక్‌కు గురిచేస్తుండడం గమనార్హం.

Exit mobile version