యంగ్ టైగర్ ఎన్టీఆర్… డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి వస్తున్న సినిమా ‘దేవర’. ఏప్రిల్ 5న రిలీజ్ కి రెడీ అవుతూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని ఎప్పటికప్పుడు మరింత పెంచుతూ మేకర్స్ నుంచి దేవర అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవలే దేవర గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన దేవర మేకర్స్… బ్లడ్ మూన్ షాట్ తో గూస్ బంప్స్ ఇచ్చారు. ఈ వీడియోకి అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎన్టీఆర్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 70 రోజుల్లో థియేటర్స్ లోకి రానున్న దేవర మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇవ్వండి అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో దేవర టీమ్ నుంచి అప్డేట్ బయటకి వస్తే అందరూ సాంగ్ అనౌన్స్మెంట్ కి సంబంధించిన అప్డేట్ అనుకున్నారు కానీ దేవర టీమ్ సైఫ్ అలీ ఖాన్ గురించి ట్వీట్ చేసింది. దేవర సినిమాలో భైరా పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కి ఇటీవలే షూటింగ్ లో గాయాలు అయ్యాయని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ దేవర టీమ్ నుంచి “మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం, మీఋ దేవర సెట్స్ లో జాయిన్ అవ్వడానికి ఎదురు చూస్తున్నాం” అంటూ ట్వీట్ వచ్చింది. దీంతో నిన్నటివరకు రూమర్ గా ఉన్న సైఫ్ అలీ ఖాన్ కి గాయాలు అనే విషయం కన్ఫర్మ్ అయ్యింది. సైఫ్ కి అయిన ఇంజ్యురీస్ కారణంగా దేవర షూటింగ్ ఏమైనా డిలే అవుతుందేమో చూడాలి.
Wishing you a Speedy recovery, Saif sir! Get well soon. Can't wait for your comeback on the sets. #Devara
— Devara (@DevaraMovie) January 23, 2024
