Site icon NTV Telugu

Sai Dharam Tej: అన్ని మామ పోలికలే.. ఎంతైనా మెగా ఫ్యామిలీ కదా

Tej

Tej

Sai Dharam Tej: ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మెగా ఇంటి తలుపు ఎప్పుడు తెరుచుకునే ఉంటుంది అన్నది ఇండస్ట్రీలో మాట. మెగాస్టార్ చిరంజీవి సాయమని కోరి వచ్చిన వాళ్లని ఉట్టి చేతులతో పంపించాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆయన దగ్గర్నుంచి ఆ సహాయం చేసే అలవాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వచ్చింది. సాయం అని వచ్చిన వారికి కాదనకుండా సాయం చేస్తాడు. ఇక సినిమాల పరంగా ఎలా అయితే వారసులు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారో.. మానవత్వాన్ని.. సహాయం చేసే గుణాన్ని కూడా మెగా హీరోలు అలాగే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అచ్చు చిన్న మామ పవన్ కళ్యాణ్ బాటలోనే నడుస్తున్నాడు అని ఎప్పటినుంచో టాలీవుడ్ లో టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇంక తాజాగా తేజ్ తన పుట్టినరోజున గొప్ప మనసు చాటుకున్నాడు.

Renu Desai: పబ్లిక్ లో చెప్తున్నా.. ఆయన తీసుకున్న నిర్ణయం..

రెండేళ్ల క్రితం తేజ్ బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చిన తేజ్ .. జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాడు. ఇక ఈ ఏడాది విరూపాక్ష సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. తేజ్ నేడు తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. తన పుట్టినరోజున రూ. 20 లక్షలు విరాళం ఇచ్చినట్లు అభిమానులకు తెలిపాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆర్మీ అధికారుల భార్యలకు పది లక్షలు విరాళంగా ఇస్తున్నానని చెప్పాడు. అంతేకాకుండా మరో రూ.10 లక్షలు ఏపీ, తెలంగాణ పోలీసులకు విరాళం ఇస్తున్నట్లు తెలిపాడు. అది తన బాధ్యత అని, వారికి మనమిచ్చే గౌరవమని తెలిపాడు. దీంతో అభిమానులు సుప్రీం హీరోను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మామలు లానే అల్లుడు కూడా మంచి మనసు కలిగిన వాడు అంటూ పొగిడేస్తున్నారు. ఇంకా మెగా ఫాన్స్ అయితే మెగా ఫ్యామిలీ కదా ఆ మంచి గుణం ఎక్కడికి పోతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం తేజ్.. గాంజా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version