NTV Telugu Site icon

Rajendra Prasad: ఆ ఘనత ఎన్టీఆర్ కే చెల్లింది!!

Ntr

Ntr

రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీఆర్ సొంతమని, ఈరోజున దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు బీజం వేసిన ప్రజా నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతుందని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని… “కలయిక ఫౌండేషన్” అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ క్యారికేచర్, కవితల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో విజేతలుగా నిలిచినవారికి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా నగదు బహుమతులు ప్రదానం చేసింది. రెండు విభాగాల్లో ప్రధములుగా నిలిచినవారికి లక్ష రూపాయల చొప్పున బహూకరించి, మిగతా విజేతలకు సుమారు అయిదు లక్షల రూపాయల నగదు బహుమతులు అందించారు.

Read Also: Adipurush: రజినీ, మహేష్ రికార్డులు బ్రేక్… ఇప్పుడు ప్రభాస్ టాప్

మాజీ ఐ.ఎ.ఎస్. అధికారి – విశ్రాంత హోమ్ సెక్రటరీ కె.పద్మనాభయ్య, ఆదాయపన్ను కమిషనర్ జీవన్ లాల్ లవాడియ, గజల్ శ్రీనివాస్, బృహస్పతి టెక్నాలజీస్ ఎమ్.డి రాజశేఖర్, సిఎస్.బి. ఐ.ఎ.ఎస్ అకాడమి డైరెక్టర్ బాల లత అతిధులుగా పాల్గొని… “కలయిక ఫౌండేషన్” అధినేత చేరాల నారాయణను అభినందించారు. అతిథులకు కృతజ్ఞతలు తెల్పిన చేరాల నారాయణ… విజేతలకు అభినందనలు తెలిపారు. చేరాల అజయ్ కుమార్, కళ్యానపు శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి సారథ్యం వహించారు.