Pavani Reddy : స్టార్ నటి పావని రెడ్డి రెండో పెళ్లి చేసుకుంది. తన ప్రియుడితో ఏడు అడుగులు వేసింది. పావని రెడ్డి బుల్లితెరపై బాగా ఫేమస్. ఆమె చాలా సీరియల్స్ లో నటించింది. తెలుగులో కొన్ని సినిమాల్లో కూడా చేసింది. ఆమె గౌరవం, అమృతంలో చందమామ, సేనాపతి, మళ్లీ మొదలైంది. చారీ 111 సినిమాల్లో నటించింది. తమిళ బిగ్ బాస్ సీజన్-5లో పాల్గొన్నప్పుడు ఆమెకు కొరియోగ్రాఫర్ అమీర్ తో పరిచయం ఏర్పడింది. అమీర్ చాలా సార్లు ప్రపోజ్ చేసినా పావని దూరం పెట్టింది. కానీ తర్వాత ఓకే చెప్పింది. దాదాపు మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. తాజాగా హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
Read Also : Trisha : పెళ్లి మీద నమ్మకం లేదు : త్రిష
అమీర్ ముస్లిం అయినా పావని కోరిక ప్రకారం ఇద్దరూ హిందూ సంప్రదాయంలో చేసుకున్నారు. పావనికి గతంలో ప్రదీప్ అనే వ్యక్తితో పెళ్లి అయింది. కానీ కొన్ని రోజులకే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి కొన్నాళ్ల పాటు పావని డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. తిరిగి వరుస సినిమాలు, ప్రోగ్రామ్స్ చేస్తూ కెరీర్ లో ఎదిగింది. ఆ టైమ్ లోనే అమీర్ పరిచయం ఆమెకు కొత్త జీవితం వైపు అడుగులు వేసేలా చేసింది. ఈ జంట పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరువురికి అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.
