Site icon NTV Telugu

Actor Naresh: సూపర్ స్టార్ కృష్ణపై పవన్ వ్యాఖ్యలు బాగా బాధ పెట్టాయి.. అయినా పవనే గెలవాలి!

Naresh

Naresh

Actor Naresh Condemns Pawan Comments on Late krishna: పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రసంగంలో చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. కూటమి ప్రచారంలో భాగంగా బహిరంగ సభ్యలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇతర నటులు వేరే పార్టీలలో ఉన్నారు. కృష్ణ కాంగ్రెస్ లో ఉన్నారు, ఎన్టీఆర్ ని కృష్ణ ఎంతగా విమర్శించినా, వ్యతిరేకంగా సినిమాలు చేసినా ఆయన ఎలాంటి వేధింపులకు పాల్పడలేదు. ఎన్టీఆర్ అంతటి సంస్కారవంతుడు. సీఎం జగన్ మాత్రం నన్ను వేధింపులకు గురి చేశాడని అంటూ కామెంట్స్ అన్నారు. ఈ కామెంట్స్ మహేష్ ఫ్యాన్స్ ని హర్ట్ చేయగా తన రాజకీయంలోకి చనిపోయిన కృష్ణను లాగాల్సిన అవసరం ఏముంది? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కొన్ని రోజులుగా ఫ్యాన్ వార్స్ కూడా నడుస్తున్నాయి. తాజాగా ఈ విషయంలో కృష్ణ రెండో భార్య విజయ నిర్మల కొడుకు, నటుడు నరేష్ స్పందించారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రసంగంలో దివంగత శ్రీ కృష్ణ గారిని విమర్శించడం నన్ను షాక్ కు గురిచేసింది. అలాగే చాలా బాధ పెట్టింది.

Pushpa Pushpa Song: పుష్ప టైటిల్ సాంగ్ దిగుతోంది.. ముహూర్తం పెట్టేశారు!

కృష్ణ గారిది బంగారు మనసు అని అందరికీ తెలుసు. అలాగే ఆయన విలువలతో కూడిన రాజకీయం చేసిన మనిషి. సినీ పరిశ్రమకి, రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆయన ఎప్పుడూ పొత్తులు మారలేదు, అలాగే ఎవరిని తన పొలిటికల్ స్పీచ్ లో పర్సనల్గా విమర్శించలేదు అని నరేష్ చెప్పుకొచ్చారు. మరో ట్వీట్ లో తనకి పవన్ కళ్యాణ్ మీద ఒక నటుడిగా అలాగే రాజకీయ నాయకుడిగా చాలా మంచి అభిప్రాయం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎవరు కృష్ణ గారిని రాజకీయపరంగా విమర్శించవద్దని కోరారు. ఇక పవన్ కళ్యాణ్ ని తాను ఆంధ్ర ప్రదేశ్ కి భవిష్యత్తుగా చూస్తున్నానని బీజేపీకి, మాజీ యూత్ ప్రెసిడెంట్ గా, జనరల్ సెక్రటరీగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు గెలిచి తీరాలని ఎన్డీఏ కూటమి గెలిచి ఏపీ మరోసారి ఒక వెలుగు వెలగాలని కోరుకుంటున్నాను అని నరేష్ పేర్కొన్నారు. చివరిగా జై శ్రీరామ్ అంటూ ఆయన ట్వీట్ ముగించారు.

Exit mobile version