NTV Telugu Site icon

Ravi Kishan: నగ్మాతో ఎఫైర్.. ఎట్టకేలకు నోరు విప్పిన ‘రేసుగుర్రం’ విలన్

Ravikishan

Ravikishan

Ravi Kishan: భోజ్ పురి నటుడు, ఎంపీ రవికిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేసుగుర్రం చిత్రంలో మద్దాల శివారెడ్డి పాత్రలో రవికిషన్ నటనను మర్చిపోవడం అంత ఈజీ కాదు. ఈ సినిమా తరువాత రవికిషన్ తెలుగులో చాలా సినిమాలు చేసి మెప్పించాడు. ఇక ఎంపీ అయ్యాకా ఆయన చేసిన మంచి పనుల గురించి ప్రజలు ఎన్నోసార్లు ఎన్నో వేదికలపై కూడా చెప్పుకొచ్చారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ప్రతి నటుడు జీవితంలో ఎన్నో వివాదాలు ఉంటాయి.. మరెన్నో రూమర్స్ ఉంటాయి. అలాగే రవికిషన్ కెరీర్ లో కూడా చాలా రూమర్స్ ఉన్నాయి.. అందులో ముఖ్యమైంది.. హీరోయిన్ నగ్మాతో ఎఫైర్. వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. అప్పట్లో వీరి మధ్య ఎఫైర్ ఉందని, రవికిషన్ భార్య ప్రీతీ శుక్లా అడ్డుపడడం వలనే వీరిద్దరి మధ్య దూరం పెరిగి బ్రేకప్ అయ్యిందని పుకార్లు షికార్లు చేసాయి. ఇది జరిగి చాలా ఏళ్లు అయినా.. ఇప్పటివరకు రవికిషన్ ఏరోజు ఈ విషయమై ప్రత్యేక్షంగా స్పందించింది లేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారి నగ్మాతో ఎఫైర్ గురించి నోరు విప్పాడు.

Naatu Naatu Song : నాటు నాటు సాంగ్‌ కు ఆలియా భట్, రష్మిక స్టెప్పులు

నగ్మాతో మీ ఎఫైర్ గురించి మీరు ఏమంటారు..? అన్న ప్రశ్నకు రవికిషన్ మాట్లాడుతూ.. ” నగ్మాతో నేను చాలా సినిమాలు చేశాను. మాది హిట్ పెయిర్. మేము ఏ సినిమా చేసినా అది హిట్ గా నిలిచింది. అందుకే మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. మేము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే. నా భార్య ప్రీతీ అంటే నాకు చాలా ఇష్టం. నా దగ్గర ఏమి లేని స్థాయి నుంచి ఇప్పటివరకు ఆమె నాతోనే ప్రయాణం చేసింది. ఆమె అంటే నాకు ఎంతో గౌరవం. నేను సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నాకా నాకు గర్వం వచ్చింది. ఎవరి మాట వినలేదు. ఒకసారి నా భార్య బిగ్ బాస్ హౌస్ కు వెళ్లమని సలహా ఇచ్చింది. ఆమె మాట మొదట వినకపోయినా .. తరువాత వెళ్ళాను. అక్కడ ఉన్న మూడు నెలలు నేను మారడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. నన్ను నేను తెలుసుకున్నాను. గర్వాన్ని విడిచి మాములు మనిషిని అయ్యాను. దీనికి కారణం నా భార్యనే” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments