Site icon NTV Telugu

Kamal Kamaraju: ఆ పని చేస్తూ.. పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నటుడు

Kamal Kamaraju Police

Kamal Kamaraju Police

Actor Kamal Kamaraju Redhandedly Caught By Police For His Mistake : నటీనటులు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి.. బహిరంగ ప్రాంతాల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉండేలా, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏదైనా చిన్న తప్పు చేసినా, ఆ అంశం హైలైట్ అవ్వడమే కాకుండా అది వారిపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అందుకే.. బయటికి వచ్చినప్పుడు చాలా పద్ధతిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఎలాంటి రూల్స్ బ్రేక్ చేయకుండా, ఆ రూల్స్‌కి అనుగుణంగా నడుచుకోవడానికి తమవంతు కృషి చేస్తారు. కానీ.. నటుడు కమల్ కామరాజు మాత్రం ఒక చిన్న తప్పు చేసి, రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతడు టెంప్ట్ అయి చేసిన ఒక పని కారణంగా.. పోలీసులు ఆ నటుడిపై కేసు బుక్ చేయాల్సి వచ్చింది.

China: చైనాలో కోవిడ్ కల్లోలం..ఏకంగా 80 శాతం మందికి వైరస్ ఇన్ఫెక్షన్

ఇంతకీ, కమల్ కామరాజు చేసిన తప్పేంటి? అని అనుకుంటున్నారా! మితవేగంతో వెళ్లాల్సిన చోట, అతి వేగంతో బైక్ నడపడమే! స్వయంగా తానే ట్విటర్ మాధ్యమంగా ఈ విషయాన్ని షేర్ చేశాడు. తాను చేసిన తప్పుకి అడ్డంగా దొరికిపోయానని ఆవేదన వ్యక్తం చేస్తూనే.. పోలీసు వ్యవస్థపై ప్రశంసలు కురిపించాడు. ‘‘ఇవాళా నేను నా బైక్ స్పీడ్ పెంచి దొరికిపోయా. పొద్దున్నే ఖాళీ రోడ్డు కనిపించడంతో, ఎగ్జైట్ అయిపోయాను. 60లో వెళ్లాల్సిన చోట 80లో వెళ్లాను. అయితే.. నేను చేసిన ఈ తప్పుని కూడా పోలీసులు గుర్తించి, నాకు చలాన్ వేశారు. అడ్వాన్స్ మెథడ్స్‌తో పోలీసులు చేస్తున్న పనితీరుకి హ్యాట్సాఫ్. వారి అభివృద్ధి పనులు చూసి నాకు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది’’ అంటూ ట్వీట్ చేస్తూ.. పోలీసులు క్లిక్‌మనిపించిన తన ఫోటోని సైతం షేర్ చేశాడు.

Anantha Sriram: వివాదంలో అనంత శ్రీరామ్.. కేసు నమోదు.. ట్విస్ట్ ఏమిటంటే?

కాగా.. ‘ఆవకాయ్ బిర్యానీ’ సినిమాతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన కమల్ కామరాజు, గోదావరి సహా మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. లెజెండ్, కాటమరాయుడు, అర్జున్ రెడ్డి, మహర్షి, వకీల్ సాబ్ వంటి సినిమాల్లోనూ సహాయక పాత్రల్లో మెరిశాడు. చివరగా నాట్యం సినిమాలో కనిపించిన కమల్, పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే.. ఇతడు ఇతర నటుల్లాగా సినిమా ఈవెంట్స్‌లలో, ప్రీరిలీజ్ ఫంక్షన్స్‌లలో కనిపించడు. కేవలం వెండితెరపై మాత్రమే అలరిస్తాడు. మీడియాకు సైతం దూరంగానే ఉంటాడు.

Brooke Shields: నటి ఆవేదన.. తెలిసిన వ్యక్తే కదా అని హోటల్‌కి వెళ్తే..

Exit mobile version