Actor Darshan’s Farm House Manager Sridhar Suicide Case may Reopen: తన అభిమాని రేణుకా స్వామి మర్డర్ కేసులో అరెస్ట్ అయి పోలీసుల కస్టడీలో ఉన్న నటుడు దర్శన్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరు శివార్లలోని నటుడు దర్శన్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. ఈ మేనేజర్ మానసిక కుంగుబాటుకు గురై డెత్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటన అనేకల్ తాలూకాలోని బగ్గనదొడ్డిలో చోటుచేసుకుంది. మృతి చెందిన మేనేజర్ పేరు శ్రీధర్. గత ఏప్రిల్‌లో మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీధర్ బగ్గనదొడ్డిలోని దుర్గా ఫాంహౌస్‌లో మేనేజర్‌గా పని చేశాడు. డెత్ నోట్ రాసి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని చూసిన శ్రీధర్ స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించగా మేనేజర్ శ్రీధర్ ఫామ్ హౌస్ పక్కన రక్తకారి రక్తమోడుతూ మృతి చెందినట్టు గుర్తించారు. ఏడాది పాటు మేనేజర్‌గా పనిచేసిన శ్రీధర్ ఫాంహౌస్ పక్కనే ఉన్న బండరాయిపై అనాథగా శవమై కనిపించాడు. దాదాపు 2 ఎకరాల 36 ఎకరాల విస్తీర్ణంలో ఫామ్ హౌస్ నిర్మాణం జరుగుతోంది. అయితే నా చావుకు నేనే కారణం, ఒంటరితనం నన్ను వేధిస్తోంది అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆనేకల్ పోలీస్ స్టేషన్‌లో యూడీఆర్ కూడా నమోదైంది.
Lover Attack: పాత బస్తీలో దారుణం.. కత్తిపీటతో ప్రియురాలిని గొంతు కోసిన ప్రియుడు..
అయితే మరణానికి ముందు దర్శన్ ఫాంహౌస్ మేనేజర్ రాసిన డెత్ నోట్ అనుమానాలకు తావిస్తోంది. డెత్ నోట్ స్వయంగా రాసిన మేనేజర్ శ్రీధర్ డెత్ నోట్ పై సంతకం పెట్టి బొటనవేలు ముద్ర కూడా వేశారు. ఇదే ఇప్పుడు అనుమానాలకు కారణాం అవుతోంది. అంతేకాదు తన మరణానికి ముందు సెల్ఫీ వీడియో కూడా చేశాడు. కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగత ఒంటరితనం నన్ను ఇబ్బంది పెడుతోంది. నాకు జీవించాలనే కోరిక లేదు, నా మరణానికి నేనే కారణం. నా మరణానికి గల కారణాలు, నేపథ్యం గురించి స్నేహితులు, కుటుంబ సభ్యులు సహా ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు. నేను ఫోన్ చేసిన ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు. నా చావుకు నేనే కారణమని మా ఇంట్లో నాన్న, అమ్మ, అక్కాచెల్లెళ్లతో సహా అందరికీ చెబుతున్నాను అంటూ పేర్కొన్నారు. ఓవరాల్ గా మేనేజర్ శ్రీధర్ చనిపోయే ముందు తీసిన 1 నిమిషం వీడియోలో నా చావుకి నేనే కారణమంటూ 10 సార్లు కన్నా ఎక్కువ క్లెయిమ్ చేశాడు. దీంతో ఆయన ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడిగా ఉన్న దర్శన్ గురించి ఆరా తీస్తుండగా.. అతడి మేనేజర్ మల్లికార్జున కూడా మిస్సింగ్ అని తెలిసింది. 2018 నుండి కనిపించకుండా పోయిన ఈ మేనేజర్‌కి దర్శన్ మరియు అతని గ్యాంగ్‌తో సంబంధం ఉందా అని పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే మిస్సింగ్ కేసును పోలీసులు రకరకాలుగా విచారిస్తుండగా.. మల్లికార్జున రాసినట్లుగా చెబుతున్న లేఖ కలకలం రేపింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది మరియు ఈ లేఖ యొక్క ప్రామాణికత ఇంకా తెలియాల్సి ఉంది. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ నిందితుడు కావడంతో అతడి పాత కేసులను కూడా పోలీసులు పరిశీలిస్తున్న నేపథ్యంలో శ్రీధర్ ఆత్మహత్య కేసును మళ్లీ విచారించే అవకాశం ఉంది.