NTV Telugu Site icon

Darshan: నటుడు దర్శన్‌కి మరో టెన్షన్.. ఇంటిని కూల్చేసే యోచనలో సర్కార్?

Darshan

Darshan

Actor Darshan Is Another Problem Rr Nagar House may be Demolished: కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే హత్య కేసులో నిందితుడైన అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం ఆయన ఇంటిని రాజకాలువను ఆక్రమించి నిర్మించుకున్నందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పుడు సంచలనంగా మారింది. బీబీఎంపీ పరిధిలోని రాజ్‌కాలువ ఆక్రమణలను ఖాళీ చేయాలని తాజాగా డీకే శివకుమార్ ఖడక్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో హీరో దర్శన్‌కు మరో సమస్య వచ్చిందని, బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌లో ఉన్న ఆయన ఇంటిని ఆక్రమణల కారణంగా ఖాళీ చేస్తున్నారని అంటున్నారు. రాజకాలువ ఆక్రమణల తొలగింపునకు దర్శన్‌తో పాటు పలువురు నిషేధాజ్ఞలు తీసుకొచ్చిన అంశం మీద మంగళవారం డీకే శివకుమార్‌ సమాధానం ఇచ్చారు. ఎవరు నిషేధాజ్ఞలు తీసుకొచ్చినా క్లియర్‌ చేస్తామని చెప్పారు.

Pawan Kalyan: మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం.. కోన వెంకట్ కీలక వ్యాఖ్యలు

రాజరాజేశ్వరి నగర్‌లోని దర్శన్‌కు చెందిన తూగుదీప నివాసం, రాజా కెనాల్‌పై నిర్మించిన ఆదర్శ గృహాలు, కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్పకు చెందిన ఎస్‌ఎస్‌ స్పర్ష్‌ ఆస్పత్రితో సహా 67 భవనాలు 8 ఏళ్ల క్రితం బీబీఎంపీ జాబితాలో ఉన్నాయి. బీబీఎంపీ అధికారులు పలుకుబడి ఉన్న వారిని ఖాళీ చేసేందుకు ఇష్టపడలేదు. కేసు కోర్టులో ఉంది. మరోవైపు ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పెద్దలకు ఒక రూలు, మాకు మరో నిబంధనా అని ప్రెజర్ పెరుగుతోంది. నటీనటులు, రాజకీయ నాయకుల ఇళ్లను తాకినప్పుడల్లా ప్రెజర్ వల్లనో, కోర్టు కేసుల వలనో వెనక్కి తగ్గాల్సి వచ్చేది. ఇక ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలని డీసీఎం బీబీఎంపీకి సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం హైకోర్టు నుంచి బీబీఎంపీ దర్శన్‌తో పాటు పలువురి నిషేధాజ్ఞలను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినట్టు చెబుతున్నారు.