Site icon NTV Telugu

Robbery: ఆడిషన్ కి వచ్చి నిర్మాతను దోచేసిన నటుడు?

Actor Silhouette

Actor Silhouette

Actor Came to Audition robbed Producer in Jubilee Hills: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక సినిమా ఆడిషన్స్ కోసం వచ్చిన వ్యక్తి అదే సినిమా నిర్మాతకి మందు పట్టించి ఆ నిర్మాత ఒంటి మీద ఉన్న ఆభరణాలతో పరారైన ఘటన జూబ్లీహిల్స్ పరిధిలో చోటు చేసుకున్నట్లు సమాచారం అందింది. పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం కృష్ణానగర్ లో ఓ రెస్టారెంట్ భవనంలో ఎల్లాలు బాబు అనే ఒక నిర్మాత సినిమా ఆఫీసు ఓపెన్ చేశాడు. ఒక సినిమా చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ నేపద్యంలో ఆడిషన్స్ కోసం కాస్టింగ్ కాల్ పిలిచారు. ఇక బుధవారం నాడు అక్కడ ఆడిషన్స్ కోసం శ్రీకాంత్ అనే కుర్రాడు వచ్చాడు. కాస్త పరిచయం ఏర్పడడంతో సదరు నిర్మాత రెండు గంటల తర్వాత తినడానికి ఏమైనా తీసుకురావాలని ఆ యువకుడిని పంపించాడు.

Sundar C: తల్లి కాలేదని చెప్పారు.. ఇంకో పెళ్లి చేసుకోమంది.. ఎన్నో బాధలు పడ్డాం!

అయితే శ్రీకాంత్ కేవలం ఆహారం మాత్రమే తీసుకు రాకుండా మద్యం కూడా తీసుకొచ్చాడు.ఇద్దరూ కలిసి సిట్టింగ్ చేయడం మొదలు పెట్టారు. కాస్త ఎక్కువ అవ్వడంతో సదరు నిర్మాత తన ఒంటి మీద ఉన్న పది తులాల బంగారం గొలుసు, చేతికున్న మూడు ఉంగరాలు, జేబులో ఉన్న 50 వేల క్యాష్ కాస్ట్లీ వాచ్ బల్ల మీద పెట్టి మరి ఎక్కువ తాగడం మొదలెట్టాడు. ఇంకేముంది కాసేపటికి గాఢమైన మత్తులోకి జారుకున్నాడు. ఇదే అదునుగా భావించి శ్రీకాంత్ ఆ వస్తువులన్నింటిని కాజేసి సైలెంట్ గా జారుకున్నాడు. లేచి చూశాక శ్రీకాంత్ తో పాటు తన వస్తువులు కూడా లేవనే విషయం అర్థమైన సదరు నిర్మాత వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు శ్రీ కాంత్ కోసం వేట ప్రారంభించారు.

Exit mobile version