Site icon NTV Telugu

Sarkaru Vaari Paata: బ్రహ్మాజీ, నవదీప్ మధ్యలో చంద్రబాబు.. అసలు ఏం జరిగింది..?

Brahmaji

Brahmaji

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  విలనిజం అయినా, కామెడీ అయినా, ఎమోషన్స్ అయినా ఆయనకు కొట్టిన పిండి. ఇక సోషల్ మీడియా లో కూడా తన కామెడీ టైమింగ్ ను ఎప్పటికి మర్చిపోడు. కామెంట్ చేసిన, ట్వీట్ చేసినా అందులో కామెడీ ఉండాల్సిందే. తాజాగా బ్రహ్మాజీ పెట్టిన ఒక కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ ట్విట్టర్ లో ఒక చిట్ చాట్ సెషన్ పెట్టాడు.. ఏంటి విశేషాలు అని మొదలైన ఈ చాట్ లో నటుడు బ్రహ్మాజీ తనదైన రీతిలో గొంతు కలిపాడు. సర్కారువారి పాట 12 న, అవతార్ డిసెంబర్ 6 న అని రిప్లై ఇచ్చాడు.

ఇక దీనికి నవదీప్ ఫస్ట్ డే ఫస్ట్ షో పోదామా అని అడగగా.. బ్రహ్మాజీ మరి టికెట్సు అని క్వశ్చన్ మార్కు పెట్టాడు.. అందుకు నవదీప్ బాబుగారిని అడుగుదాం అని సలహా ఇచ్చాడు. ఇక ఈ ప్రశ్నకు బ్రహ్మజీ అల్టిమేట్ ఆన్సర్ ఇచ్చాడు.. సిబిఎన్ గారినా బాగోదేమో అంటూ బాంబ్ పేల్చాడు. ఇక దీంతో నెటిజన్స్ బ్రహ్మజీ కామెడీ టైమింగ్ కు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ బాబు గారిని కాస్తా చంద్రబాబు గారిని చేసేశారే అని కొందరు.. మధ్యలో ఆయన ఎందుకు వచ్చారండీ  అని మరికొందరు కామెంట్స్ చేస్తుండగా .. ఇంకొందరు సూపర్ పంచ్ అంటూ బ్రహ్మజీ ని పొగిడేస్తున్నారు.

Exit mobile version