Site icon NTV Telugu

జగన్ సార్ అందరికీ వరాలు ఇస్తున్నారు… పాపం వాళ్ళకే ఎందుకిలా ?

Brahmaji

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై ఎగ్జిబిషన్ పరిశ్రమ ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. మహమ్మారి సమయంలో థియేటర్లు నెలల తరబడి మూతపడినప్పటి కంటే ఇప్పుడు పెరుగుతున్న ఈ నష్టాలు మరింత పెద్దవిగా భావిస్తున్నారు థియేటర్ యాజమాన్యం. కనిష్ఠ టిక్కెట్ ధర థియేటర్ యజమానులకు నిద్ర లేకుండా చేస్తోంది. జీవో 35కి వ్యతిరేకంగా కొందరు ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించడంతో, హైకోర్టు జిఓను రద్దు చేసింది. హైకోర్టు సూచనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. ఇలాగైతే కొంతమంది ఎగ్జిబిటర్లు తమ డిస్ట్రిబ్యూటర్లకు ఇంత తక్కువ ధరలకు థియేటర్లను నడపడం చాలా కష్టమని తెలియజేశారు. కొందరైతే ప్రస్తుతానికి తమ థియేటర్లను మూసివేశారు. తెలంగాణాలో థియేటర్ పార్కింగ్ ఫీజు, ఆంధ్రాలో ఉన్న టికెట్ రేట్ల కంటే ఎక్కువగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సీనియర్ నటుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

“వైఎస్ జగన్ సార్… అందరికీ వరాలు ఇస్తున్నారు… పాపం థియేటర్ ఓనర్స్ కి, సినిమా వాళ్ళకి హెల్ప్ చేయండి… ఇట్లు మీ నాన్న గారి అభిమాని” అంటూ బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో తెలంగాణ థియేటర్ పార్కింగ్ ఫీజు, ఆంధ్రాలో ఉన్న టికెట్ రేట్లకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా ఈ నటుడు జత చేశారు. మరి ఆంధ్రాలో టికెట్ రేట్ల విషయమై ఏపీ ప్రభుత్వం ఎప్పటికి కరుణిస్తుందో చూడాలి.

Read Also :

https://ntvtelugu.com/dhanushs-next-film-titled-sir/
Exit mobile version