Site icon NTV Telugu

Bonda Mani: రాజు శ్రీ వాత్సవ మృతి.. మరో కమెడియన్ పరిస్థితి విషమం..

Bonda Mani

Bonda Mani

Bonda Mani: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు సినీ అభిమానులకు భయాందోళలనకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ప్రముఖ కమెడియన్ రాజు శ్రీ వాత్సవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ఈ విషయం ఇంకా మరువక ముందే మరో స్టార్ కమెడియన్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతోంది. కోలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు బోండా మణి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ఆయన రెండు మూత్ర పిండాలు దెబ్బ తిన్నాయని తెలియడంతో అప్పటినుంచి బోండామణిని చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చి కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఖరీదైన చికిత్సను అందించలేకపోతున్నామని, దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయవలసిందిగా కోరుతున్నారు.

ఇక ఇటీవలే బోండా మణిని చూడడానికి హాస్పిటల్ కు వెళ్లిన మరో నటుడు బెంజిమెన్ ఆయన దీనస్థితిని వివరిస్తూ కంటతడి పెట్టుకున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని, ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారని, ఎవరైనా సాయం చేయాల్సిందిగా ఆయన అభ్యర్ధించారు. ఇక బోండామణి సొంత ఊరు శ్రీలంక.. బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా చెన్నైకి వచ్చేసిన ఆయన 1991 లో కె. భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన పవుణ..పవుణదాన్ చిత్రంలో మొదటిసారి కనిపించాడు. ఇక ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో కనిపించిన మెప్పించిన నటుడు.. త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version