Site icon NTV Telugu

Actor Bikshu : ఇలియానా బాగా ఇబ్బంది పెట్టేసింది.. ఏకంగా 9 నెలలు పాటు!

Ileana

Ileana

Actor Bikshu Comments on Ileana Dcruz: దేవదాసు సినిమాతో హీరోయిన్ గా మారి ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారిన ఇలియానా గురించి నటుడు, అనేక మందికి నటనలో శిక్షణ ఇచ్చిన ఎన్జీ బిక్షు హాట్ కామెంట్స్ చేశారు. నిజానికి భిక్షు తెలుగులో వేణు, జూనియర్ ఎన్టీఆర్, నితిన్, నిఖిల్ సిద్ధార్థ్, రామ్, సాయి ధరంతేజ్, ఇలియానా, దీక్షా సేథ్, సుహాసిని, పార్వతి మెల్టన్, బెల్లంకొండ శ్రీనివాస్, నాగశౌర్య వంటి వారికి శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైవిఎస్ చౌదరి ఇలియానాకు శిక్షణ ఇవ్వమని నా దగ్గరికి పంపించారని, రామ్ ని కూడా అదే సమయంలో పంపించారని చెప్పుకొచ్చారు. ఇలియానా ఇప్పుడు నేషనల్ లెవెల్ లో తన యాక్టింగ్ తో ఆకట్టుకుంటుందని ముఖ్యంగా బర్ఫీ సినిమాలో ఆమె నటన తన బాగా నచ్చింది అని ఆయన చెప్పుకొచ్చారు. ఇలియానాకి యాక్టింగ్ నేర్పించడం చాలా కష్టమైపోయిందని భిక్షు చెప్పుకొచ్చారు.

Adhurs: రాంగ్ టైమింగ్ గురువు గారూ!

ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడే ఇంగ్లీష్ నాకు అర్థం అయ్యేది కాదని పోర్చుగీస్, ఫ్రెంచ్ రెండు కలిపి ఆమె మాట్లాడేసరికి నాకు అర్థం అయ్యేది కాదని ఆయన చెప్పుకొచ్చారు. అప్పుడు మా ఆవిడ ఇన్స్టిట్యూట్ కి వచ్చి ఇలియానాని హ్యాండిల్ చేసిందని ఈ క్రమంలో ఆమె యాక్టింగ్ నేర్చుకోవడానికి దాదాపు తొమ్మిది నుంచి పది నెలలు పట్టిందని చెప్పుకొచ్చారు. అయితే పెద్ద హీరోలలో మాత్రం తను ఎవరు ఇబ్బంది పెట్టలేదని అందరూ హ్యాపీగా నేర్చుకున్నారని ఆయన కామెంట్లు చేశారు. ఇలియానాతో పోలిస్తే రామ్ చాలా త్వరగా నేర్చుకున్నాడు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇలియానా ప్రస్తుతానికి సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక విదేశీయుడిని వివాహం చేసుకున్న ఆమె ఏకంగా పాపకు జన్మనిచ్చి హాట్ టాపిక్ అయింది.

Exit mobile version